STOCKS

News


ఈ కామర్స్‌ నియంత్రణకు నిబంధనలు

Wednesday 11th July 2018
news_main1531327819.png-18218

జెనీవా: భారత​ఈ కామర్స్‌ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఈ కామర్స్‌ రంగం 2020 నాటికి 120 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్‌ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్‌ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో జరిగిన మూడో ఇంటర్‌ గవర్నమెంటల్‌ నిపుణల బృందం సమావేశంలో పాశ్వాన్‌ మాట్లాడారు. అంతర్జాతీయ సరఫరా చైన్‌ల అవతరణ, వాణిజ్య అడ్డంకులు తగ్గిపోవడం, అంతర్జాతీయ వాణిజ్యం పెరగడం, ఈ కామర్స్‌ వేగవంతమైన విస్తరణతో కొత్త తరహా అనైతిక వ్యాపార ధోరణులకు ముప్పు పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వినియోగదారుల రక్షణ కోసం డైరెక్ట్‌ సెల్లింగ్‌ నియంత్రణకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఈ కామర్స్‌ రంగానికి నిబంధనలను తీసుకొచ్చే పని జరుగుతోందని చెప్పారు. ఇవి నియంత్రణ యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతోపాటు, ఈ కామర్స్‌ సంస్థలు చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించేందుకు వీలు కల్పిస్తాయని, వినియోగదారుల ప్రయోజనాలు, హక్కులకు కూడా రక్షణనిస్తాయని తెలిపారు. 



You may be interested

విజయవాడలో ఉబర్‌ ఈట్స్‌

Wednesday 11th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ డెలివరీ కంపెనీ ఉబర్‌ ఈట్స్‌ విజయవాడలో సేవలను ప్రారంభించింది. ప్యారడైజ్, క్రీమ్‌స్టోన్, డ్రన్‌కీన్‌ మంకీ, సెవెన్‌ డేస్, సదరన్‌ స్పైస్‌ వంటి స్థానిక రెస్టారెంట్లతో ఉబర్‌ ఈట్స్‌ ఒప్పందం చేసుకుంది. ఉబర్‌ రైడ్స్‌ కంటే ముందు ఉబర్‌ ఈట్స్‌ సేవలను ప్రారంభించిన తొలి నగరం విజయవాడేనని ఉబర్‌ ఈట్స్‌ హెడ్‌ భావిక్‌ రాథోడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తొలి ఐదు ఆర్డర్లకు 50 శాతం

భారత్‌ బ్రిటన్‌నూ దాటి వెళుతుంది

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: భారత్‌ 2017లో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టేసి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను కూడా త్వరలో అధిగమించనున్నట్టు ఈ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. స్థూల జీడీపీ 2.59 లక్షల కోట్ల డాలర్లతో 2017లో భారత్‌ ఆరో స్థానంలో ఉంటే, ఫ్రాన్స్‌ ఏడో స్థానానికి దిగజారిన విషయం గమనార్హం. ఫ్రాన్స్‌ జీడీపీ 2.58 లక్షల కోట్ల

Most from this category