STOCKS

News


అమెరికా ఉత్పత్తులపై సుంకాల పెం‍పు వాయిదా

Wednesday 19th December 2018
news_main1545194018.png-23064

న్యూఢిల్లీ: అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల పెంపును భారత్‌ నాల్గవసారి వాయిదావేసింది. జనవరి 31వ తేదీ వరకూ ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక ప్రకటన చేస్తూ, సుంకాల నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆర్థిక శాఖను వాణిజ్య మంత్రిత్వశాఖ కోరినట్లు తెలియజేసింది. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో కేం‍్రదం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...
♦ స్టీల్‌, అల్యూమినియంసహా భారత్‌ నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మార్చి 9న సుంకాలను పెంచారు. దానికి ప్రతిగా ఆ దేశం నుంచి దిగుమతయ్యే బాదం, వాల్‌నట్‌, పప్పులు సహా 29 ఉత్పత్తులపై ఆగస్టు 4 నుంచీ సుంకాలు విధించాలని గత జూన్‌లో భారత్‌ నిర్ణయించింది.
♦ అటు అటు తర్వాత ఈ తేదీ సెప్టెంబర్‌ 18కి వాయిదా పడింది. 
♦ తిరిగి నవంబర్‌ 2కు వాయిదా వేయాలని కేంద్ర నిర్ణయించింది.
♦ మళ్లీ ఈ తేదీ డిసెంబర్‌ 17కు వాయిదా పడింది. 
♦ తాజాగా ఈ తేదీ జనవరి 31కి వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
♦ భారత్‌ 2017-18లో అమెరికాకు 47.9 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. దిగుమతుల విలువ 26.7 బిలియన్‌ డాలర్లు. వాణిజ్య సమతౌల్యం భారత్‌కు అనుకూలంగా ఉంది. 



You may be interested

రిఫైనరీల ఏర్పాటుపై సౌదీతో రిలయన్స్‌ చర్చలు

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: కొత్త పెట్టుబడులకు సంబంధించి సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచ అతిపెద్ద చమురు ఎగుమతి సంస్థ ‘సౌదీ ఆరామ్‌కో’తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చర్చలను కొనసాగిస్తోంది. ముకేష్ అంబానీ కుమార్తె ఈశా వివాహానికి హాజరైన సమయంలో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ఏర్పాటుపై అంబానీతో చర్చించినట్లు సౌదీ అరేబియా ఆయిల్‌ శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీహ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఉమ్మడి పెట్టుబడులు.. పెట్రోకెమికల్, రిఫైనింగ్, కమ్యూనికేషన్స్ ప్రాజెక్టులలో సహకారంపై ఆయనతో

తాజా మొండి బకాయిలు తగ్గాయ్‌: ఎస్‌బీఐ

Wednesday 19th December 2018

హైదరాబాద్‌: తాజా మొండి బకాయిలు తగ్గాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిటైల్‌ అండ్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. భారీ మొండి బకాయిల ఖాతాలకు సంబంధించి పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీలో  ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మొండి బకాయిలు తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ హైదరాబాద్‌ మెయిన్‌ బ్రాంచ్‌ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో

Most from this category