STOCKS

News


పెరిగిన ఎగుమతులు

Saturday 15th December 2018
news_main1544850140.png-22960

న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులు నవంబర్‌లో 26.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదేకాలంతో పోల్చితే 0.80 శాతం వృద్ధి చెందాయి. ఇందుకు బేస్‌ఎఫెక్ట్‌ ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు దిగుమతులు 4.31 శాతం పెరిగి 43.17  బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం ద్వారా వెల్లడైంది. 2016 డిసెంబర్‌ తరువాత దిగుమతులు ఈస్థాయిలో తగ్గడం ఇదే ప్రథమం కాగా.. బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఇందుకు కారణంగా నిలిచింది. నవంబర్‌లో పసిడి దిగుమతులు భారీగా 15.6 శాతం తగ్గాయి. విలువలో 2.75 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం) 16.67 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

ఈ ఏడాది మొత్తంగా..
ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలానికి ఎగుమతులు 11.58 శాతం పెరిగి 217.52 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఈకాలంలో దిగుమతులు 11.58 శాతం పెరిగి 217.52 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు దిగుమతులు 49.14 శాతం పెరిగి 97.43 బిలియన్‌ డాలర్లకు చేరుకోగా.. వాణిజ్యలోటు 128.13 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

పెరిగిన, తగ్గిన ఎగుమతి వస్తువులు
ఇంజనీరింగ్, రత్నాభరణాలు, పత్తి, తోలు, ఐరెన్‌ ఓర్‌, సముద్ర ఉత్పత్తులు, జీడిపప్పు, బియ్యం ఎగుమతులు మందగించగా.. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ప్లాస్టిక్, కార్పెట్, వస్త్రఎగుమతులు మరింత పెరిగాయి. 

ఎగుమతులను ప్రోత్సహించండి: ఎఫ్‌ఐఈఓ
ఎక్స్‌పోర్ట్‌ పెరిగేందుకు ప్రభుత్వం అత్యవసర, తక్షణ మద్దతు ఇవ్వాలని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షడు గణేష్‌ గుప్తా డిమాండ్‌ చేశారు. ఎగుమతుల రంగానికి రుణాలు, వడ్డీ రాయితీ ఇవ్వాలని కోరారు.



You may be interested

నిధుల వేటలో మైక్రోఫైనాన్స్‌ సంస్థలు

Saturday 15th December 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ సంక్షోభ నేపథ్యంలో ద్రవ్య లభ్యత కొరతతో కొట్టుమిట్టాడిన మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఇప్పుడు ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టిని సారించాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో ఆగస్ట్‌27న రూ.9వేల భారీ కుంభకోణం వెలుగు చూడటంతో గత 2-3 నెలలుగా మైక్రోఫైనాన్స్‌ తీవ్ర ద్రవ్య లభ్యత కొరతను ఎదుర్కోన్నాయి. ద్రవ్యలభ్యత కొరత సంక్షోభ సుడిగుండం నుంచి గట్టేందుకు మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ప్రత్యమ్నాయ మార్గమైన నిధుల సమీకరణకు మార్కెట్‌ బాట పట్టాయి. ఇప్పటికే ఢిల్లీకి చెందిన  మైక్రోఫైనాన్స్‌

ఆకలిగా ఉందా? లాగించెయ్‌!

Saturday 15th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో పిజ్జాలు, బర్గర్లు కామన్‌! మరి, ఇవి ఎంత వరకు హైజెనిక్‌? పోనీ, ఆర్గానిక్‌ ఫుడ్‌తో లాగించేద్దామంటే ముంబైవాసి హితేష్‌ అహుజాకి నాలుకకి రుచించలేదు. అంతే! చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి.. ప్యాకేజ్డ్‌ పిజ్జా అండ్‌ మామోస్‌ స్టార్టప్‌ ‘యమ్‌లేన్‌’ను ప్రారంభించేశాడు. ప్యాకేజీల్లో వచ్చే పిజ్జా, మోమోస్‌ను అప్పటికప్పుడు ఓవెన్‌ లేదా పెనంపై వేడి చేసుకుని తినగలగటమే యమ్‌లేన్‌ ప్రత్యేకత. ఫ్లిప్‌కార్ట్‌ కో–ఫౌండర్‌ బిన్నీ బన్సల్‌ నుంచి

Most from this category