STOCKS

News


హెచ్‌ఎస్‌బీసీ భారత ఖాతాదారుల వివరాలు వెల్లడి..!

Wednesday 8th August 2018
news_main1533704257.png-19036

న్యూఢిల్లీ: స్విస్‌ బ్యాంకుల్లో భారత కుబేరులు దాచుకున్న నల్లధనం వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. స్విట్జర్లాండ్ అత్యున్నత న్యాయస్థానం భారతీయుల సమాచారాన్ని ఆ దేశ ప్రభుత్వానికి అందించాలని హెచ్‌ఎస్‌బీసీని ఆదేశించిన నేపథ్యంలో మరో 10 రోజుల్లోనే డేటా తమ చేతికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. హెచ్‌ఎస్‌బీసీలో ఉన్నటువంటి మొత్తం డిపాజిట్లపై అధికారిక అంచనా లేదని, విదేశాలలో రూ.8,448 కోట్లు ప్రకటించని ఆదాయం ఉండగా.. రూ.5,447 కోట్ల మేర పన్ను రావాల్సి ఉందని పార్లమెంట్‌ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన వివరించారు. 164 కేసుల్లో రూ.1,290 కోట్ల పెనాల్టీ విధించినట్లు చెప్పారు. 2010-11 కాలానికి హెచ్‌ఎస్‌బీసీ ఖాతాదారుల జాబితా వెల్లడికాగా, 2011-12 నుంచి 2014 వరకు ఉన్న సమాచారాన్ని అందుకోవడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని వివరించారు. ‘‘రెవిన్యూ సెక్రెటరీని స్విస్‌కు పంపించి ఆ దేశ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశాం. 2015 అక్టోబరు 15న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సమాచారాన్ని పంచుకునే అవకాశం లభించింది. వచ్చే వారం పది రోజుల్లో భారత హెచ్‌ఎస్‌బీసీ ఖాతాదారుల జాబితా అందనుంది’’ అని గోయల్‌ తెలిపారు. 199 ఫిర్యాదులు అందగా వీటిలో 84 కేసులను ఫైల్‌ చేసినట్లు వివరించిన ఆయన, విదేశాల్లో పెట్టుబడులు పెట్టి వివరాలు వెల్లడించని రూ.1,533 కోట్ల విలువైన సమాచారాన్ని కనుగొన్నట్లు తెలిపారు. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా 2 లక్షలకు మించిన షెల్‌ కంపెనీల గుర్తింపును ఆర్‌ఓసీ రద్దు చేసినట్టు వెల్లడించారు. మరో 2 లక్షల షెల్‌ కంపెనీలను గుర్తించి వీటిలో 80,000 కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. పన్ను చెల్లింపుదారులు గడిచిన నాలుగేళ్లలో 50 శాతం పెరిగినట్లు తెలిపారు. 
 



You may be interested

ఎస్కార్ట్స్‌ చైర్మన్‌గా నిఖిల్ నందా

Wednesday 8th August 2018

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ఎస్కార్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టరుగా నిఖిల్ నందా నియమితులయ్యారు. ఈయన ఎన్నికను కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా అంగీకరించింది. ఎస్కార్ట్స్‌ చైర్మన్‌ రాజన్‌ నందా కన్నుమూయడంతో ఆయన కుమారుడు నిఖిల్ నందా గ్రూప్‌ బాధ్యతలను చేపట్టారు. ఈ విషయాన్ని కంపెనీ బోర్డ్‌ అధికారికంగా ప్రకటించింది. 

భారీ విస్తరణ ప్రణాళికలో ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్

Wednesday 8th August 2018

పశ్చిమబెంగాల్: పారిశ్రామిక, వాహన బ్యాటరీలను ఉత్పత్తి చేసే ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ భారీ విస్తరణ ప్రణాళికను చేపట్టింది. రీసైకిల్ లిడ్‌ నుంచి తుది వస్తువు వరకు బ్యాటరీల ఉత్పత్తికి అవసరమైన అన్ని విభాగాలను ఒకేచోట ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పశ్చిమబెంగాల్‌లోని పోర్ట్‌ సిటీ హల్దియాలో ఇప్పటికే ఉన్నటువంటి ప్లాంట్‌ను మరింత విస్తరించనుంది. ఆగ్నేయాసియాలో అతి పెద్ద యూనిట్‌ను ఏర్పాటుచేయడంలో భాగంగా మరో రెండు ప్రాజెక్టులకు కంపెనీ సీఈఓ గౌతం ఛటర్జీ మంగళవారం

Most from this category