STOCKS

News


భారత్‌ బ్రిటన్‌నూ దాటి వెళుతుంది

Wednesday 11th July 2018
news_main1531327761.png-18217

న్యూఢిల్లీ: భారత్‌ 2017లో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టేసి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను కూడా త్వరలో అధిగమించనున్నట్టు ఈ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. స్థూల జీడీపీ 2.59 లక్షల కోట్ల డాలర్లతో 2017లో భారత్‌ ఆరో స్థానంలో ఉంటే, ఫ్రాన్స్‌ ఏడో స్థానానికి దిగజారిన విషయం గమనార్హం. ఫ్రాన్స్‌ జీడీపీ 2.58 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలగిన బ్రిటన్‌ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. అంటే భారత్‌ కంటే బ్రిటన్‌ కేవలం 25 బిలియన్‌ డాలర్ల మేరే అధికంగా ఉంది. ఇక అమెరికా 19.39 లక్షల కోట్ల డాలర్లతో మొదటి స్థానంలో ఉండగా, చైనా 12.23 లక్షల కోట్ల డాలర్లు, జపాన్‌ 4.87 లక్షల కోట్ల డాలర్లు, జర్మనీ 3.67 లక్షల కోట్ల డాలర్లతో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బ్రెజిల్‌ 8వ స్థానంలో ఉంటే, ఇటలీ 9వ స్థానంలో, కెనడా 10వ స్థానంలో ఉన్నాయి. 



You may be interested

ఈ కామర్స్‌ నియంత్రణకు నిబంధనలు

Wednesday 11th July 2018

జెనీవా: భారత​ఈ కామర్స్‌ రంగ నియంత్రణ కోసం నిబంధనలను రూపొందించే పని జరుగుతోందని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఈ కామర్స్‌ రంగం 2020 నాటికి 120 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కామర్స్‌ రంగం ఏటా 51 శాతం మేర వృద్ధి చెందుతున్నప్పటికీ, డిజిటల్‌ మార్కెట్లకు సంబంధించిన చట్టాలను ఇంకా రూపొందించాల్సి ఉందన్నారు. వాణిజ్యం, అభివృద్ధిపై జెనీవాలో

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు ‘ఆన్‌లైన్‌ పోటీ’

Wednesday 11th July 2018

అవకాశాలను సొంతం చేసుకునేందుకు సంస్థల క్యూ ప్రత్యేకంగా యాప్స్‌ విడుదల రేసులోకి పేటీఎం, పైసా బజార్‌ కాయిన్‌ పేరుతో జెరోదా సేవలు నిధులను సమీకరించిన గ్రోవ్‌, నివేష్‌, ఓరోవెల్త్‌ న్యూఢిల్లీ: ఒకవైపు స్మార్ట్‌ఫోన్ల విస్తృతి, డేటా వినియోగం, మరో వైపు పెరుగుతున్న యువతరం ఆర్జనా శక్తి... ఇవన్నీ ఇప్పుడు మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లకు జోష్‌నిస్తున్నాయి. ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్లకు ఇదో ఆదాయ వనరుగా కనిపిస్తోంది. పేటీఎం, పైసాబజార్‌ కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. చెన్నై కేంద్రంగా

Most from this category