STOCKS

News


బడ్జెట్‌ రోజు ఈ తాయిలాలు?!

Sunday 27th January 2019
news_main1548611117.png-23826

మరో నాలుగు రోజుల్లో బడ్జెట్‌ కేటాయింపులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌ (ఓటాన్‌ అకౌంట్‌) కావడంతో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు వర్గాలను ఆకర్షించేందుకు కొన్ని ప్రకటనలు చేయవచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనాలతో ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ అతిపెద్ద కూటమిగా అవతరిస్తుందని తాజా సర్వేలు పేర్కొన్నా, 2014తో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గుతుందని తేల్చాయి. కనుక ఈ దశలో కీలకమైన ప్రకటనలు చేయక తప్పని పరిస్థితి నెలకొందన్నది విశ్లేషణ. మరోవైపు ఇదే జరిగితే ఇప్పటికే ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతాన్ని దాటిపోవడంతో, మరింత భారం పడుతుందని, కనుక ప్రభుత్వం మరీ పెద్ద నిర్ణయాల జోలికి వెళ్లకపోవచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే, కీలక నిర్ణయాలు ఏవైనా తదుపరి ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేట్టు అయితే, ప్రభుత్వం నిధుల సమీకరణ, ఆదాయ పెంపు మార్గాలతో ద్రవ్యలోటును అధిగమించే అవకాశాలు లేకపోలేదన్న విశ్లేషణా వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలు, ఒకవేళ వాటికి చోటిస్తే... ఏ ప్రకటనలు ఉండొచ్చంటే....

 

చిన్న వ్యాపారుల కోసం...
ఇప్పటికే జీఎస్టీ పరిధిలో రూ.20 లక్షల టర్నోవర్‌ కలిగిన వ్యాపారులకు మినహాయింపు ఉండగా, దీన్ని రూ.40 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. దీనివల్ల 20 లక్షల మంది వ్యాపారులకు ఊరట కలుగుతుందని అంచనా. అలాగే, ఈ వర్గాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలన్న ప్రతిపాదన, ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఈ కామర్స్‌ కంపెనీలైన అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ధాటికి సంప్రదాయ చిన్న వర్తకులు దెబ్బతింటున్నారన ఆందోళనలు నేపథ్యంలో... ఈకామర్స్‌ సంస్థలు, తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించే విషయంలో ప్రభుత్వం ఇటీవల నియంత్రణలు తెచ్చిన విషయం తెలిసిందే, దీన్ని త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

రైతుల కోసం...
నేరుగా రైతులకు నగదు బదిలీ ప్రయోజనాన్ని అందించడం, వారికి వడ్డీ రహిత రుణాలను ఇవ్వడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని సమాచారం. వడ్డీ రహిత రుణాలను ఇవ్వడం వల్ల ప్రభుత్వరంగ బ్యాంకులకు ఏడాదికి రూ.12,000 కోట్ల మేర చెల్లించాల్సి వస్తుందని అంచనా. ప్రతీ హెక్టార్‌కు రూ.2,000-4,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని ఇవ్వాలన్నది ప్రతిపాదన. దీనివల్ల రూ.లక్ష కోట్ల వ్యయం అవుతుందని అంచనా. రైతుల రుణాల మాఫీకి అవకాశాలు దాదాపు తక్కువేనని అంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ హామీని ఇప్పటికే ప్రకటించిన విషయం గమనార్హం. 

 

మధ్య తరగతి వారికి...
టీవీలు, సినిమా టికెట్లు తదితర 20 ఉత్పత్తులపై ఇప్పటికే ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపును పెంచే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉంది. దీనిపైనా ప్రకటన ఉండొచ్చని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.You may be interested

2018-19లో రూ.1,600 కోట్ల లాభం: నాల్కో 

Sunday 27th January 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.1,2000 కోట్ల ఆదాయంపై రూ.1,600 కోట్ల లాభాన్ని నమోదు చేయగలని నాల్కో పేర్కొంది. ‘‘‘‘మా టర్నోవర్‌ను ప్రస్తుతమున్న రూ.10,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచుకోవాలనే విషయమై కార్పొరేట్‌ ప్రణాళికతో ఉన్నాం. ఈ ఏడాదికి (ఆర్థిక సంవత్సరానికి) రూ.12,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయగలం’’ అని నాల్కో సీఎండీ తపన్‌కుమార్‌ చంద్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.1,600 కోట్ల లాభాన్ని నమోదు

జనవరి 29న చాలెట్‌ హోటల్స్‌ ఐపీఓ

Saturday 26th January 2019

కే.రహేజా గ్రూప్‌కు చెందిన చాలెట్‌ హోటల్స్‌ ఐపీఓ జనవరి 29న ప్రారంభం కానుంది. ఇదే నెల 30న ముగిసే ఈ ఐపీఓ ద్వారా రూ.1640 కోట్లు సమీకరించాలన్నది యోచన. ఐపీఓ ధర శ్రేణి రూ.275- రూ.280గా ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 950 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రమోటర్‌ గ్రూప్‌  రూ.609 కోట్ల విలువైన 2.46 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఇష్యూ కోసం కనీసం 53 షేర్ల(ఒక

Most from this category