STOCKS

News


రేట్లు పెంచితే పెద్ద తప్పు చేసినట్లే!

Tuesday 31st July 2018
news_main1533033236.png-18816

వడ్డీరేట్లపై మార్క్‌మొబియస్‌ అభిప్రాయం
ఈ వారం జరిగే పరపతి సమీక్షా సమావేశంలో రేట్లు పెంచడం జరిగితే ఆది ఆర్‌బీఐ చేసే ‘అతిపెద్ద తప్పు’ అవుతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. ఒకపక్క ఎక్కువ మంది అనలిస్టులు ఆర్‌బీఐ ఈ దఫా రేట్లు పెంచుతుందని అంచనాలు వేస్తున్నారు. కానీ మొబియస్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో దాదాపు అందరు ఎకనమిస్టులు ఈ దఫా ఆర్‌బీఐ పావు శాతం మేర రేట్లు పెంచవచ్చని అంచనా వేశారు. రేట్లను నిర్ధారించే మానిటరీ పాలసీ కమిటీ సమావేశం సోమవారం ఆరంభమైంది. ఆగస్టు ఒకటిన కమిటీ నిర్ణయాలను వెలువరిస్తుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ఠం వద్ద ఉంది. ఆర్‌బీఐని కలవరపెట్టే అంశాల్లో ధరల పెరుగుదల తొలిస్థానంలో ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే దేశంలోని రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, వీటిని తీర్చాలంటే నిజానికి రేట్లను తగ్గించాలని  మొబియస్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడు పెట్టుబడులు ఊపందుకుంటాయన్నారు. భారత్‌లో పలు వైరుధ్యాలున్నాయని, రాష్ట్రాల్లో వృద్ధి సమస్యలున్నాయని, ఇవన్నీ చూడకుండా రేట్లను పెంచితే అది అతిపెద్ద తప్పుగా చెప్పవచ్చని అన్నారు. 



You may be interested

మళ్లీ రికార్డు ప్రారంభం

Wednesday 1st August 2018

వరుస రికార్డులతో దూసుకుపోతున్న భారత్‌ మార్కెట్‌ బుధవారం తిరిగి లాభాలతోనే ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంతో 37.644 పాయింట్ల వద్ద మొదలై 37,665 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,375  పాయింట్ల వద్ద కొత్త రికార్డు సృష్టించింది. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు

స్వల్పకాలానికి షేర్‌ఖాన్‌ సిఫార్సులు

Tuesday 31st July 2018

షార్ట్‌టర్మ్‌లో 18 శాతం వరకు రాబడినిచ్చే మూడు స్టాకులను షేర్‌ఖాన్‌ రికమండ్‌ చేస్తోంది. 1. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 250. స్టాప్‌లాస్‌ రూ. 215. కొన్ని వారాలు తీరైన కరెక‌్షన్‌ చూసింది. తాజాగా వీక్లీ చార్టుల్లో డౌన్‌ సైడ్‌ కదలికలు ముగిసిన సంకేతాలు ఇస్తోంది. ప్రస్తుతం పుల్‌బ్యాక్‌ మూడ్‌లోకి ఎంటరయింది. ఇండికేటర్లు కూడా బుల్లిష్‌గా మారాయి. 2. ఐడీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 57. స్టాప్‌లాస్‌ రూ. 45.50. చాలా వారాలుగా

Most from this category