STOCKS

News


ఐదేళ్లలో ఆర్‌బీఐ నుంచి రూ.2.5 లక్షల కోట్లు

Tuesday 20th November 2018
news_main1542737198.png-22233

ఆర్‌బీఐ కేంద్ర ప్రభుత్వానికి కల్ప వృక్షంగా మారిందంటే ఆశ్చర్యం పోనక్కర్లేదు. ఎందుకంటే గత ఐదేళ్లలో ఆర్‌బీఐ కేంద్రానికి రూ.2.5 లక్షల కోట్లను బదలాయించింది. ఇది ఆర్‌బీఐ ఆదాయంలో 75 శాతం కావడం గమనార్హం. 

 

ప్రభుత్వ ఆర్థిక ఖాతాలను కాగ్‌ గతేడాది పరిశీలన సందర్భంగా... ఆర్‌బీఐ ఆదాయాలను, మిగులు నిల్వలు, కేంద్రానికి 2013-14 నుంచి 2017-18 మధ్య ఎంత బదలాయించిందన్న వాటిని కూడా అధ్యయనం చేసింది. ఈ ఐదేళ్ల కాలంలో ఆర్‌బీఐకి రూ.3.3 లక్షల కోట్ల ఆదాయం సమకూరితే... ఇందులో నుంచి రూ.2.48 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించింది. అత్యధికంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ తనకు వచ్చిన ఆదాయంలో 83 శాతాన్ని కేంద్రానికి ఇవ్వడం గమనార్హం. అయినప్పటికీ ఆర్‌బీఐ వద్దనున్న అధిక మిగులు నిల్వలపై ప్రస్తుతం వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అధిక నిధుల నుంచి తనకు కొంత బదిలీ చేసుకోవాలన్నది కేంద్రం యోచన. ఇతర దేశాల కేంద్ర బ్యాంకులతో పోలిస్తే మన ఆర్‌బీఐ వద్ద అధిక మిగులు నిల్వలు ఉన్నాయని ఆర్థిక సర్వే సైతం ప్రస్తావించింది.  

 

ఇటీవలే ఆర్‌బీఐ కేంద్రానికి రూ.65,000 కోట్లను డివిడెండ్‌ రూపంలో అందించింది. ఆర్‌బీఐ వ్యయాలు 2016-17 వరకు రూ.15,000 కోట్లుగానే ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.31,000 కోట్లకు పెరిగాయి. డీమోనిటైజేషన్‌ తర్వాత కొత్త నోట్ల ముద్రణకు చేసిన ఖర్చు ఇందుకు కారణం. ఆర్‌బీఐ నిధులను కేంద్రం ఆశిస్తుండడాన్ని తప్పుబట్టడమే కాకుండా, అర్జెంటీనాను ఉదాహరణగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య పేర్కొన్న విషయం విదితమే. 



You may be interested

రూపాయి ముందు మరో అవరోధం!

Tuesday 20th November 2018

దేశీయ కరెన్సీ రూపాయి ఒక అవరోధాన్ని అధగమించగా, మరో అడ్డంకి ముందున్నదని బ్లూంబర్గ్‌ సంస్థ పేర్కొంది. ఆర్‌బీఐ, ప్రబుత్వం మధ్య కీలక అంశాల్లో సంధి కుదరడం ద్వారా ఒక అవరోధాన్ని అధిగమించినట్టు తెలిపింది. రాష్ట్రాల ఎన్నికల రూపంలో మరో అవరోధాన్ని దాటాల్సి ఉందని అభిప్రాయపడింది. రాజకీయ అనిశ్చితి పెరిగిపోవడం అన్నది ప్రధాని మోదీకి పెద్ద సమస్య అని, 2019 ఎన్నికలకు ముందు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల్లో కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నట్టు

రూపాయికి కొత్త సవాళ్లు..!

Tuesday 20th November 2018

ముంబై: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కీలక అంశాలన్నిటి మధ్యా సయోధ్య కుదిరి.. డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఉదయం బలపడింది. ఈ ర్యాలీతో రూపాయి వరుసగా బలపడడం ఆరవ రోజుకు చేరుకుంది. గడిచిన 13 నెలల వరుస నష్టాలకు బ్రేక్‌ వేసింది. అయితే, తాజా సయోధ్య వల్ల రూపాయి ఒక సవాలును మాత్రమే అధిగమించిందని, అసలు సవాళ్లు ఇంకా ఉన్నాయని ఐఎన్‌జీ గ్రూప్‌ ఎకనమిస్ట్‌ ప్రకాష్ సక్‌పాల్

Most from this category