STOCKS

News


ప్రాంతీయ విమానాల్లో డేటా సేవలు..!

Saturday 20th October 2018
news_main1540010125.png-21306

న్యూఢిల్లీ: దేశ సరిహద్దులలోని నౌకలు, విమానాలలో డేటా సేవలను అనుమతించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత ఇన్‌-ప్లైట్‌ కనెక్టివిటీ మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని.. వాయిస్‌, డేటా అనుమతిని పరిగణనలోకి తీసుకుంటున్నామని టెలికాం శాఖ తెలియజేసింది. దేశ సరిహద్దుల అవతల వినియోగానికి సంబంధించి పలు సమస్యలు ఉన్నందున సేవలు సరిహద్దులకు లోబడే ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై తుది నిర్ణయాన్ని వెలువరించే ముందుగా మార్పుల నిమిత్తం వచ్చేవారంలో టెలికాం శాఖ న్యాయ విభాగాన్ని కలిసే అవకాశం ఉంది. మరోవైపు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయాల్లో మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ నిబంధన మాత్రం అలానే కొనసాగనున్నట్లు సమాచారం. ఇక విదేశాల్లో వై-ఫై వినియోగానికి అనుమతి ఉండగా, భారత్‌లో మాత్రం ఈసేవపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎయిర్‌ఏషియా, ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటీష్ ఎయిర్‌వేస్, ఈజిప్ట్ ఎయిర్, ఎమిరేట్స్, ఎయిర్ న్యూజిలాండ్, మలేషియా ఎయిర్‌లైన్స్‌, కతార్ ఎయిర్వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి 30 సంస్థలు మొబైల్‌ వినియోగాన్ని ఇతర దేశాల్లో అనుమతిస్తున్నాయి. ఇక్కడి మార్గదర్శకాల ప్రకారం సర్వీసులలో ఆంక్షలు విధిస్తున్నాయి. 



You may be interested

4 శాతం పెరిగిన పసిడి దిగుమతులు

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు ప్రస్తుత  ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో  (ఏప్రిల్‌-సెప్టెంబర్) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్‌ డాలర్లు. వాణిజ్యశాఖ ఈ మేరకు తాజా గణాంకాలను విడుదల చేసింది.వార్షికంగా భారత్‌ 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ దీనికి నేపథ్యం. పసిడి దిగుమతులు

ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు రేసులో ఉన్నాం

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు రేసులో వేదాంత కూడా ఉందని ఆ సంస్థ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ప్రకటించారు. బిడ్‌ మొత్తాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ‘‘స్టీల్‌ ఉత్పత్తికి అవసరమైన ముడి ఇనుము, సహజవాయువు ఉత్పత్తి చేసే వేదాంత కంపెనీ, ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు అనువైనది. ఇది ఎస్సార్‌ స్టీల్‌కు కూడా అనుకూలమే’’ అన్నారాయన. బ్యాంకులకు రూ.50,800 కోట్ల రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైన ఎస్సార్‌ స్టీల్‌ కేసు...

Most from this category