STOCKS

News


దిగుమతులపై సుంకాలను పెంచిన కేంద్రం

Thursday 27th September 2018
news_main1538024255.png-20628

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును నియంత్రించడం, రూపాయి విలువ క్షీణతకు చెక్‌పెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 19 రకాల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో విమాన ఇంధనం, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషిన్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ దిగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్ల మేర ఉంటుందని తెలిపింది. సుంకాల పెంపుతో వీటి ధరలు మరింత పెరిగిపోతాయి. తద్వారా వాటి దిగుమతులకు ఆదరణ తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘కొన్ని రకాల దిగుమతులను నిరోధించేందుకు గాను ప్రాథమిక కస్టమ్స్‌ డ్యూటీని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం టారిఫ్‌ చర్యలు తీసుకుంది. కరెంటు ఖాతా లోటును కుదించడమే ఈ చర్యల ఉద్దేశ్యం’’ అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు అనవసర దిగుమతులను నిరోధించనున్నట్టు కేంద్రం ఈ నెల 14నే ప్రకటించింది. 
 వేటిపై ఎంతెంత?
ఉత్పత్తి    ప్రస్తుత టారిఫ్‌    నూతన టారిఫ్‌ (శాతంలో)
ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్లు (10కేజీల్లోపు)    10    20
కంప్రెషర్లు    -    10
స్పీకర్లు    -    15
ఫుట్‌వేర్‌    -    25
రేడియల్‌ కార్‌ టైర్లు    10    15
కట్‌, పాలిష్డ్‌ వజ్రాలు, సెమీ ప్రాసెస్డ్‌ డైమండ్స్‌, ల్యాబ్‌లో తయారైన వజ్రాలు, కలర్‌ జెమ్‌ స్టోన్స్‌    5    7.5
జ్యుయలరీ ఆర్టికల్స్‌, సిల్వర్‌ వేర్‌    15    20
బాత్‌వేర్‌, ప్యాకింగ్‌ మెటీరియల్‌, టేబుల్‌వేర్‌, కిచెన్‌వేర్‌, ఆఫీస్‌ స్టేషనరీ, డెకరేటివ్‌ షీట్లు, బీడ్స్‌, గాజులు, ట్రంక్‌, సూట్‌కేసులు, ట్రావెల్‌ బ్యాగులు    10    15
ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌    (లేదు)    5
 



You may be interested

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4 శాతం వాటా విక్రయం

Thursday 27th September 2018

ముంబై: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4 శాతం వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. యాక్సిస్‌ ఏఎమ్‌సీ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ సంస్థలు ప్రమోట్‌ చేస్తున్న ఫండ్స్‌ ఈ వాటాను కొనుగోలు చేయనున్నాయి.  ఈ డీల్‌ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్‌ పరంగా చూస్తే, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విలువ రూ.12,000 కోట్లని అంచనా. ఈ ఒప్పందంలో భాగంగా యాక్సిస్‌  ఏఎమ్‌సీ తరపున యాక్సిస్‌ న్యూ ఆపర్చునిటీస్‌ ఏఐఎఫ్‌-వన్‌ ఫండ్‌

చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల ప్యాకేజీ

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: చక్కెర రంగానికి రూ.5,538 కోట్ల మేర ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలియజేసింది. చెరకు పండించే వారికి ఇచ్చే ఉత్పత్తి సాయం, ఎగుమతి చేసే మిల్లులకు ఇచ్చే రవాణా సబ్సిడీ రెండు రెట్లకు పైగా పెరిగింది. మిగులు చక్కెర నిల్వల సమస్యకు పరిష్కారం చూపే క్రమంలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నాలుగు

Most from this category