STOCKS

News


పుంజుకోనున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ!

Tuesday 22nd January 2019
Markets_main1548130584.png-23720

- 2019, 2020పై ఐఎంఎఫ్‌ నివేదిక
- ద్రవ్యలోటుపై మాత్రం తీవ్ర ఆందోళన
- తగ్గనున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు
- అవుట్‌లుక్‌ను విడుదల చేసిన
ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) ఎక్కువ.  ఈ రెండు సంవత్సరాల్లో చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంటుందని వివరించింది. తద్వారా భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తున్న దేశంగా నిలుస్తుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. క్రూడ్‌ ధరలు తక్కువగా ఉండడం, నిత్యావసరాల ధరల పెరుగుదల స్పీడ్‌ తగ్గడం, కఠిన ద్రవ్య పరపతి విధాన ప్రక్రియ నెమ్మదించడం భారత్‌ వృద్ధి పురోగతికి కారణంగా వివరించింది.  ఐఎంఎఫ్‌ మొట్టమొదటి మహిళా చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు...

- ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటుపై భారత్‌లో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి.
- ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తోంది. 2019, 2020ల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.5, 3.6 శాతాలుగా ఉంటాయి. గత అంచనాలతో పోల్చితే ఈ అంచనాలు వరుసగా 0.2 శాతం 0.1 శాతం తక్కువ.  గతంలో ఊహించినదానికన్నా భిన్నంగా, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి మందగమనం దీనికి ప్రధాన కారణం.
- చైనా ప్రకటిస్తున్న కొన్ని ఆర్థిక ఉద్దీరణ చర్యలు అమెరికా అధిక టారిఫ్‌ల తీవ్రతను కొంత తగ్గిస్తున్నా... ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం తప్పదు. ఫైనాన్షియల్‌ రెగ్యులేటరీ నిబంధనల కఠినతరం, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలూ దీనికి కారణం.
- అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు 2018లో 6.5 శాతం. 2019లో ఇది 6.3 శాతానికి తగ్గుతుంది. 2020లో​ 6.4 శాతంగా ఉండే అవకాశం ఉంది.
- గడచిన ఐదు సంవత్సరాల్లో ఎన్నడూలేనంత ఆందోళనకర స్థితిలో భారత్‌ ద్రవ్యలోటు తీవ్రత ఉంది. దీనిని కట్టడి చేయాల్సి ఉంది.

పెరగనున్న రాష్ట్రాల ద్రవ్యలోటు: ఇండియా రేటింగ్స్‌
ఎన్నికల సంవత్సరంలో రాష్ట్రాల ద్రవ్యలోటు పెరగనుందని ఫిచ్‌ గ్రూప్‌ కంపెనీ- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పెరిగింది. వ్యవసాయ రుణాల మాఫీ, ఇతర స్కీమ్‌లు ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించింది.


IMF

You may be interested

వైద్య వ్యయాల తగ్గింపై కేంద్రం దృష్టి

Tuesday 22nd January 2019

- కొన్ని వైద్య పరికరాలపై కస్టమ్స్‌ సుంకం కోత? - బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేంద్రం కసరత్తు న్యూఢిల్లీ: రోగులకు వైద్య వ్యయాల తగ్గింపు లక్ష్యంగా రానున్న వార్షిక బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కొన్ని వైద్య పరికరాలపై దిగుమతి సుంకాల తగ్గింపును కేంద్రం పరిశీలిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ముక్కుకు సంబంధించి ఆపరేషన్‌లో వినియోగించే పీడీఎస్‌ ప్లేట్స్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి 2.5 శాతానికి

‘ఎఫ్‌ జెడ్‌’ సిరీస్‌లో 2 నూతన బైక్‌లు

Tuesday 22nd January 2019

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తన ఎఫ్‌ జెడ్‌ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను సోమవారం మార్కెట్లో విడుదలచేసింది. ఎఫ్‌ జెడ్‌–ఎఫ్‌1, ఎఫ్‌జెడ్‌ఎస్‌–ఎఫ్‌1 పేర్లతో ఈ బైక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్‌).. 149 సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ల ధరల శ్రేణి రూ.95,000–రూ.97,000గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15

Most from this category