STOCKS

News


టాలెంట్‌లో తగ్గిన భారత్‌

Wednesday 21st November 2018
news_main1542775525.png-22243

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్‌ వార్షిక టాలెంట్ ర్యాంకింగ్‌లో ఈసారి భారత్ రెండు స్థానాలు దిగజారి 53వ స్థానానికి పరిమితమైంది. అయిదోసారి కూడా స్విట్జర్లాండ్ అగ్రస్థానం దక్కించుకుంది. 63 దేశాలతో ఐఎండీ బిజినెస్ స్కూల్ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ జాబితాలో టాప్‌-5 స్థానాల్లో స్విట్జర్లాండ్‌ వెనుకన డెన్మార్క్‌, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌ ఉన్నాయి. ఆసియా దేశాల్లో మాత్రం సింగపూర్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్‌ లిస్టులో మాత్రం సింగపూర్‌కు 13వ స్థానం దక్కింది. విద్యపై పెట్టే పెట్టుబడులు ఇతర సంపన్న దేశాల సగటుతో పోల్చినా తక్కువగా ఉండటం, నిపుణులైన విదేశీయులను ఆకర్షించడంలో సమస్యలు ఎదుర్కొంటుండటం తదితర అంశాల కారణంగా చైనా ర్యాంకింగ్‌ 39కి పరిమితమైంది. భారత్ విషయానికొస్తే.. టాలెంట్‌ పూల్‌లో సగటు స్థాయి కన్నా మెరుగ్గా ఉందని (సంసిద్ధత ప్రాతిపదికన 30వ స్థానం), మరోవైపు టాలెంట్‌ అభివృద్ధిపై పెట్టుబడులో మాత్రం వెనుకబడి ఉందని (63వ స్థానం) ఐఎండీ బిజినెస్ స్కూల్ పేర్కొంది. టాలెంట్ అభివృద్ధిపై పెట్టుబడులు, ఆకర్షణ, సంసిద్ధత అనే మూడు అంశాల ప్రాతిపదికన ర్యాంకులను నిర్ణయిస్తారు. స్థానిక టాలెంట్‌ అభివృద్ధికి వెచ్చిస్తున్న వనరులు, ప్రతిభావంతుల నైపుణ్యాలు, ప్రతిభావంతులను ఆకర్షించడంలోనూ, అట్టే పెట్టుకోగలగడంలోను ఆయా దేశాల సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీకి రూ.500 కోట్ల మసాలా బాండ్ల నిధులు

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ మసాలా బాండ్ల జారీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. మీడియమ్‌ టర్మ్‌ నోట్‌ (ఎమ్‌టీఎన్‌) ప్రోగ్రామ్‌లో భాగంగా రూపీ డినామిటేడెడ్‌ బాండ్లను జారీ చేసి ఈ నిధులు సమీకరించింది. విదేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో భారత కంపెనీలు జారీ చేసే ఈ బాండ్లలో స్థానిక కరెన్సీల్లో కాకుండా రూపాయల్లో మాత్రమే పెట్టుబడి పెట్టగలిగే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని మసాలా బాండ్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నిధుల

జిర్కాన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓకు సెబీ ఓకే !

Wednesday 21st November 2018

న్యూఢిల్లీ: జిర్కాన్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వస్తువుల ప్యాకేజింగ్‌కు సంబంధించిన లేబుల్‌ ప్రింటింగ్‌ వ్యాపారాన్ని ఈ కం‍పెనీ నిర్వహిస్తోంది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 59 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, డెహ్రాడూన్‌లో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు తీర్చుకోవడానికి, ఇతర

Most from this category