సీమాంతర దివాలా కేసులకు 'ఐరాస' తరహా చట్టాలు
By Sakshi

న్యూఢిల్లీ: సీమాంతర దివాలా కేసుల పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితిలో భాగమైన యూఎన్సిఐటీఆర్ఏఎల్ తరహా చట్టాలను అమల్లోకి తేవచ్చని కేంద్రానికి అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా అభివృద్ధి చెందిన దేశాల ప్రమాణాలకు తగ్గ స్థాయిలో దేశీ దివాలా చట్టాలను మెరుగుపరచుకోవచ్చని పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ సారథ్యంలోని దివాలా చట్ట కమిటీ (ఐఎల్సీ) సోమవారం ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి నివేదిక సమర్పించింది. సీమాంతర దివాలా అంశాలకు సంబంధించి సమగ్ర పరిష్కారానికి యూఎన్సీఐటీఆర్ఏఎల్ చట్ట నిబంధనలు తోడ్పడగలవని, అందుకే వీటిలో కొన్నింటిని దేశీ దివాలా చట్టంలో కూడా పొందుపర్చవచ్చని సిఫార్సు చేసినట్లు కమిటీ పేర్కొంది. చాలా మటుకు భారతీయ కంపెనీలకు విదేశాల్లోను, ఇతరత్రా విదేశీ కంపెనీలకు భారత్‌లోను కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలో ఈ చట్టాల అమలు కీలకమని వివరించింది. అంతర్జాతీయ వాణిజ్య చట్టాల క్రమబద్ధీకరణకు 1966లో యూఎన్సీఐటీఆర్ఏఎల్ (అంతర్జాతీయ వాణిజ్య చట్టాల ఐక్యరాజ్య సమితి కమిషన్) ఏర్పాటైంది. యూఎన్సీఐటీఆర్ఏఎల్ మోడల్ చట్టాలను దాదాపు 44 దేశాలు అమలు చేస్తున్నాయి.
You may be interested
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7% వృద్ధి
Tuesday 23rd October 2018న్యూఢిల్లీ: దేశీ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం వృద్ధి నమోదయినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ మూడవ వారం నాటికి మొత్తం వసూళ్లు రూ.4.89 లక్షల కోట్లగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ స్థాయి వృద్ధి రేటును సాధించినట్లు సీబీడీటీ అధికారి ఒకరు సోమవారం మీడియాకు వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ప్రత్యక్ష పన్ను
ఐనాక్స్ లీజర్ మొత్తం ఆదాయం రూ.369 కోట్లు
Tuesday 23rd October 2018న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ల నిర్వహణ కంపెనీ ఐనాక్స్ లీజర్ మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.369 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.314 కోట్ల మొత్తం ఆదాయం వచ్చిందని, 17 శాతం వృద్ధి సాధించామని ఐనాక్స్ లీజర్ తెలిపింది. నికర లాభం రూ.11.68 కోట్ల నంచి 2 శాతం వృద్ధితో రూ.11.97 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.296 కోట్ల నుంచి