STOCKS

News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌.. ఏ బ్యాంకులకు సమస్య?

Thursday 13th September 2018
news_main1536834650.png-20241

ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌’ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) గ్రూప్‌కు మీ బ్యాంక్‌ ఏమైనా భారీగా అప్పులిచ్చిందేమో చూడండి. ఇది దివాలా అంచుకు చేరుకుంది. దీంతో ఇచ్చిన మొత్తం తిరిగి రాకపోవచ్చు. ఇటీవలే రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా దీనికి ‘చెత్త’ రేటింగ్‌ ఇచ్చింది. దీంతో గ్రూప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏం చేయాలో తెలియక జట్టుపట్టుకుంటున్నాయి. రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వల్ల దాదాపు 35 మ్యూచువల్‌ ఫండ్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఫండ్స్‌ మాత్రమే కాదు లిస్టెడ్‌ బ్యాంకులకు కూడా ఈ సెగ తాకనుంది. గ్రూప్‌ ఆర్థిక పరిస్థితి ఇక ఏ కొంచెం అధ్వానంగా మారినా పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది.  ఈ బ్యాంకుల మొత్తం కార్పొరేట్‌ రుణాల్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వాటా 0.5-1 శాతం శ్రేణిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారంనాటి మార్కెట్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 5 శాతం మేర పతనమయ్యింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎక్స్‌ఫోజరే అధికం. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ వంటి బ్యాంకులు కూడా రుణాలిచ్చాయి. అయితే ఇవి ఇచ్చిన రుణాల మొత్తం తక్కువ.  ఇక్రా కన్నా ముందు ఇండియా రేటింగ్స్‌ కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రేటింగ్‌ తగ్గించింది.  
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ దాదాపు రూ.91,000 కోట్ల రుణాలు తీసుకుంది. ఇందులో బ్యాంకు రుణాలు రూ.57,000 కోట్లు. ఇందులో ప్రభుత్వ బ్యాంకులకు 70 శాతం, ప్రైవేట్‌ బ్యాంకులు 10 శాతం కన్నా తక్కువ ఇక ఎల్‌ఐసీ, విదేశీ బ్యాంకులు మిగిలిన వాటాను కలిగి ఉన్నాయి. కేవలం ఐఎల్‌అండ్‌ఎఫ్‌సీ ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌ ఒక్కటే రూ.35,000 కోట్ల రుణాన్ని కలిగి ఉంది. అలాగే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు రూ.17,000 కోట్ల రుణ భారం ఉంది. 

గ్రూప్‌ మొత్తం రుణాలను (దాదాపు రూ.91,091 కోట్లు) పరిశీలిస్తే.. డిబెంచర్ల వాటా రూ.24,296 కోట్లుగా, టర్మ్‌ లోన్స్‌ వాటా రూ.55,870 కోట్లుగా, బ్యాంక్స్‌ క్యాష్‌ క్రెడిట్‌ వాటా రూ.1,452 కోట్లుగా, సబ్‌-ఆర్డినేట్‌ రుణాల వాటా రూ.1,363 కోట్లుగా, ఇంటర్‌ కార్పొరేట్‌ డిపాజిట్ల వాటా రూ.2,317 కోట్లుగా, వాణిజ్య పత్రాల వాటా రూ.5,751 కోట్లుగా, లీజ్‌ ఫైనాన్స్‌ వాటా రూ.39 కోట్లుగా ఉంది. 

2018 మార్చి 31 నాటికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ టాప్‌ షేర్‌హోల్డర్లను గమనిస్తే.. ఎల్‌ఐసీకి 25.34 శాతం, జపాన్‌కు చెందిన ఒరిక్స్‌ కార్ప్‌ 23.54 శాతం, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌    12.56 శాతం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎంప్లాయి వెల్‌ఫేర్‌ ట్రస్ట్‌ 12 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 9.02 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7.67 శాతం, ఎస్‌బీఐ    6.42 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 14th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:52 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 41 పాయింట్ల లాభంతో 11,486 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,417 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా ప్రధాన సూచీలన్నీ

హెచ్‌పీసీఎల్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరీటీస్‌ బుల్లిష్‌

Thursday 13th September 2018

ముంబై:- ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) షేరుపై ప్రముఖ రేటింగ్‌ సం‍స్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సం‍స్థ బుల్లిష్‌గా ఉంది. షేరుకు ఉన్న బలమైన వాల్యూవేషన్స్‌ కారణంగా షేరుకు ‘‘బై’’కు కేటాయించినట్లు రేటింగ్‌ సం‍స్థ చెబుతోంది. హెచ్‌పీసీఎల్‌ షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీష్‌ విశ్లేషణలేమిటో ఇప్పుడు చూద్దాం... సెక్టార్‌:- రీఫైనరీ సెక్టార్‌ ప్రస్తుత షేరు ధర:- రూ. 233.50 టార్గెట్‌ ధర:- రూ.476 విశ్లేషణ:- హెచ్‌సీఎల్‌సీఎల్‌ షేరు పెరిగిన పెట్రోల్‌, డిజిల్‌

Most from this category