STOCKS

News


తయారీ, మైనింగ్‌ పేలవం

Saturday 10th August 2019
news_main1565416295.png-27682

  • జూన్‌ పారిశ్రామిక ఉత్పత్తిపై ఎఫెక్ట్‌
  • వృద్ధి కేవలం 2 శాతం
  • నాలుగు నెలల కనిష్ట స్థాయి

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్‌లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్‌తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్‌లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- మైనింగ్‌, తయారీ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. 
- దేశంలో పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమనంలో కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్చిలో 2.7 శాతంగా ఉంది. ఏప్రిల్‌ (4.3 శాతం), మే నెలల్లో (4.6 శాతం) కొంత బాగుందనిపించినా, మళ్లీ జూన్‌ వచ్చే సరికి భారీగా జారిపోయింది. 
- తయారీ: 2018 జూన్‌లో 6.9 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు 2019 జూన్‌లో కేవలం 1.2 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. 
- క్యాపిటల్‌ గూడ్స్‌: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్‌లను సూచించే క్యాపిటల్‌ గూడ్స్‌ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. 
- మైనింగ్‌: మైనింగ్‌లో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. 
- విద్యుత్‌: విద్యుత్‌ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. 
- కన్జూమర్‌ డ్యూరబుల్స్‌: కార్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఉత్పత్తిలో అసలు వృద్దిలేకపోగా -5.5 శాతం క్షీణత నమోదయ్యింది. 
- కన్జూమర్‌ నాన్‌-డ్యూరబుల్స్‌: కాస్మొటిక్స్‌, క్లీనింగ్‌ ప్రొడక్ట్స్, దుస్తులు వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో మాత్రం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. 

జూన్‌ త్రైమాసికమూ మందగమనమే
ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు ఏప్రిల్‌, మే, జూన్‌ త్రైమాసిక కాలాన్ని చూసినా, పారిశ్రామిక వృద్ధి​మందగమనంలోనే ఉంది. ఈ కాలంలో వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.1 శాతం. 



You may be interested

ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్లు, యాప్స్‌

Saturday 10th August 2019

ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇండిగో వ్యూహం కోల్‌కతా: చిన్న పట్టణాల్లోని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ప్రాంతీయ భాషల్లో వెబ్‌సైట్స్‌, యాప్స్‌ను ప్రవేశపెట్టడంపై ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ ఇండిగో కసరత్తు చేస్తోంది. హిందీ, బెంగాలీతో పాటు ఎనిమిది భారతీయ భాషల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు డిజిటల్ సక్సెస్ సదస్సు - 2019లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్ (డిజిటల్‌) నితిన్ సేఠి చెప్పారు."మాకు డిజిటల్ మాధ్యమం చాలా ముఖ్యం. మరింత మంది

ఆటోమొబైల్‌లో ఉత్పత్తికి కోతలు

Saturday 10th August 2019

తగ్గిన డిమాండ్‌కు అనుగుణంగా మార్పులు టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా నిర్ణయాలు న్యూఢిల్లీ: మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని సవరించుకుంటున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో 8 నుంచి 14 రోజుల వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా శుక్రవారం ప్రకటించింది. టాటా మోటార్స్‌ సైతం తగ్గుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సవరించనున్నట్టు ధ్రువీకరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) పలు ప్లాంట్లలో 8-14 రోజుల

Most from this category