News


2019-20లో జీడీపీ వృద్ధి 7.4 శాతం

Saturday 22nd December 2018
news_main1545450962.png-23158

ముంబై: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వరకు నమోదు కావచ్చని ఐసీఐసీఐ బ్యాంకు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటును 7.2 శాతానికి తగ్గించింది. వినియోగం సెప్టెంబర్‌ త్రైమాసికంలో తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. వృద్ధి వేగంగా పుంజుకోకపోవచ్చని తాము భావిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్స్‌ హెడ్‌ బి ప్రసన్న తెలిపారు. వృద్ధి రికవరీ వినియోగం ఆధారితంగా కాకుండా పెట్టుబడి ఆధారితంగా ఉంటుందన్నారు. డీమోనిటైజేషన్‌, జీఎస్టీ ప్రభావాల నుంచి రియల్‌ ఎస్టేట్‌, చిన్న స్థాయి పరిశ్రమలు ఇంకా బయటపడకపోవడం వృద్ధికి ప్రధాన అవరోధాలుగా ఐసీఐసీఐ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. కమోడిటీ ధరలు ప్రస్తుత స్థాయిలోనే ఉండొచ్చని, కానీ, చమురు ధరలు వృద్ధిని నిర్ణయించే అంశంగా ప్రసన్న తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత  కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడం వృద్ధికి, మార్కెట్లకు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిలోనే ఉంటుందని, ద్వితీయార్ధంలో మాత్రం 4.8 శాతం వరకు పెరగొచ్చని అంచనా ఐసీఐసీఐ బ్యాంకు అంచనా వేసింది. వచ్చే ఫిబ్రవరి సమావేశంలో ఆర్‌బీఐ తన విధానాన్ని ‘క్రమంగా కఠినతరం’ నుంచి తటస్థానికి సవరించొచ్చని పేర్కొంది. 



You may be interested

అవాంఛిత కాల్స్‌పై టెల్కోలకు గడువు పొడిగింపు

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్‌, మెసేజీలపై యూజర్లు ఫిర్యాదు చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు టెల్కోలకు విధించిన గడువును ట్రాయ్ ఫిబ్రవరి ఆఖరు దాకా పొడిగించింది. అప్పటికీ ఏర్పాటు చేయకపోతే మార్చి నుంచి నెలకు గరిష్టంగా రూ. 50 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యాపారపరమైన అవాంఛిత కాల్స్‌, మెసేజీల నియంత్రణ నిబంధనలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ జూలైలో నోటిఫై చేసింది. ఇందులో

బ్యాంకింగ్ లావాదేవీలపై పాక్షిక ప్రభావం

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: వేతనాల సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు నిర్వహించిన ఒక్క రోజు సమ్మెతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల శాఖలు మూతబడగా, మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది లేక ఖాళీగా కనిపించాయి. బ్రాంచీల్లో డిపాజిట్‌, విత్‌డ్రాయల్‌, చెక్కుల క్లియరెన్సులు, డ్రాఫ్ట్‌ల జారీ తదితర లావాదేవీలపై ప్రభావం పడింది. అయితే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి.

Most from this category