STOCKS

News


టెక్నాలజీపై అతిగా ఆధారపడొద్దు..

Thursday 13th September 2018
news_main1536814030.png-20222

ముంబై: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాల మంజూరీలో టెక్నాలజీపై అతిగా ఆధారపడరాదని, ఉద్యోగులు వివేచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ పేర్కొన్నారు. దరఖాస్తుదారు అర్హతలను మదింపు చేసే విషయంలో కంప్యూటర్ ఆల్గోరిథమ్స్‌, క్రెడిట్ బ్యూరోలిచ్చే స్కోర్లు, సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ మొదలైన వాటిపై మరీ ఎక్కువగా ఆధారపడకూడదని ఆయన సూచించారు. వీటిని తారుమారు చేసే అవకాశాలూ ఉన్నాయన్నారు. పోనీ పన్ను రిటర్నులను ప్రాతిపదికగా తీసుకున్నా.. దాఖలు చేసేవారిలో చాలా మంది తక్కువ ఆదాయ వర్గాలే ఉంటున్నందున స్పష్టమైన అంచనాకు రావడం కష్టమని బాగ్చీ తెలిపారు. బ్యాంక్‌ బజార్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. రుణాల మంజూరీ వ్యవధిని సాధ్యమైనంతగా కుదించే క్రమంలో చాలామటుకు ఆర్థిక సంస్థలు.. ఆన్‌లైన్ సాధనాలు, డేటాను ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో బాగ్చీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 



You may be interested

ఐటీలో భద్రతా వ్యవస్థ లేమి..!

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: ధృడమైన భద్రతా వ్యవస్థ లేకపోవడం వల్లే భారత ఐటీ సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్నట్లు వెల్లడయింది. ప్రమాద, సమగ్ర నిర్వహణ సంస్థ నేత్రికా కన్సల్టెంగ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. తాము సర్వే చేపట్టిన కంపెనీలలో 65 శాతం సైబర్ దాడులకు బలమైన భద్రతా వ్యవస్థ లేకపోవడమే కారణమని తేలినట్లు ఈ సంస్థ వెల్లడించింది. 18 శాతం కంపెనీలు మాత్రమే 25 మందికి మించిన నిపుణులతో భద్రతా

ఆర్‌పీ4 రేటింగ్‌ కోసం ఎన్‌పీఏలపై 60 శాతం నష్టాలు

Thursday 13th September 2018

ముంబై: ఆర్‌బీఐ స్వతంత్ర పరపతి మదింపు కార్యాచరణ (ఐసీఈ) పరిధిలో రూ.50,000 కోట్లకు పైగా ఎన్‌పీఏలుండగా, వీటికి పరిష్కార ప్రణాళిక అమలు కోసం ఆర్‌పీ4 రేటింగ్‌ అవసరమని, ఇందుకు బ్యాంకులు 40- 60 శాతం నష్టపోవాల్సి (హేర్‌కట్‌) ఉంటుందని అసోచామ్‌-క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. జూన్‌ నాటికి ఎన్‌సీఎల్‌టీ 32 ఎన్‌పీఏల పరిష్కార ప్రణాళికలకు ఆమోదం తెలియజేయగా, రూ.89,400 కోట్ల క్లెయిమ్‌లకు గాను పరిష్కారం రూ.50,000 కోట్ల వరకే ఉండడం గమనార్హం.

Most from this category