STOCKS

News


ఐబీసీతో రుణాల రికవరీ వేగవంతం: ఫిక్కీ

Monday 13th August 2018
news_main1534136197.png-19198

న్యూఢిల్లీ: ఐబీసీతో రుణాల రికవరీ ప్రక్రియ వేగవంతం అయిందని, బ్యాంకుల పరిస్థితి మెరుగుపడిందని ఫిక్కీ అభిప్రాయపడింది. ఐబీసీతో రుణాల ఎగవేతకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం ముందుకు వచ్చే ధోరణి కంపెనీల ప్రమోటర్లలో పెరిగినట్టు ఫిక్కీ సర్వేలో బ్యాంకర్లు పేర్కొన్నారు. రుణాల రికవరీ మరింత వేగవంతం అయ్యేందుకు న్యాయవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచాలని బ్యాంకర్లు సూచించారు. మారిటోరియంను 270 రోజులకు మించి అనుమతించకూడదని ఫిక్కీ సర్వేలో పాల్గొన్న 22 బ్యాంకర్లు కోరారు. అదే సమయంలో ఆచరణ సాధ్యమైన వ్యాపారాలను కలిగి ఉన్న కంపెనీలకు రుణాల కాల వ్యవధిని, మారటోరియం సమయాన్ని పెంచాలని సూచించారు. సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 55 శాతం ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య తమ రుణాల ఎంసీఎల్‌ఆర్‌ను 0.20 శాతం వరకు పెంచినట్టు చెప్పగా, 27 శాతం దీన్ని 0.30 శాతం పెంచినట్టు తెలిపారు. ఇక టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపును అర శాతం మేర పెంచినట్టు 41 శాతం బ్యాంకర్లు చెప్పడం గమనార్హం.



You may be interested

జెట్ ఎయిర్‌వేస్‌పై డీజీసీఏ ఆడిట్‌

Monday 13th August 2018

ముంబై: సమస్యలతో సతమతమవుతున్న జెట్ ఎయిర్‌వేస్‌ ఆర్థిక పరిస్థితులపై ఆడిట్ నిర్వహించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సిద్ధమవుతోంది. ఆగస్టు 27 నుంచి ఆడిట్ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎయిరిండియా ఆడిట్ పూర్తి అయినట్లు వివరించాయి. ఎగిసిన ముడిచమురు ధరలు, చౌక విమాన చార్జీలతో జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, త్రైమాసిక ఫలితాల వెల్లడిని వాయిదా వేయడం తెలిసిందే.   

పసిడికి డాలర్‌ ఎఫెక్ట్‌

Monday 13th August 2018

ముంబై:- డాలర్‌ పెరుగుదలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర సోమవారం భారత కాలమానం ప్రకారం గం.10:00 ని.లకు 3.70 డాలర్లు స్వల్ప తగ్గుదలతో 1,215.40 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. టర్కీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా డాలర్‌ విలువ 13నెలల గరిష్టానికి తాకింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల మారకంలో డాలర్‌ ఇండెక్స్‌ జూలై 2017 తరువాత 96.50

Most from this category