STOCKS

News


దివాలా చట్టంతో మంచి ఫలితాలు

Monday 26th November 2018
news_main1543213266.png-22381

  • రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల పరిష్కారం
  • కార్పొరేట్‌ శాఖ సెక్రటరీ ఇంజేటి శ్రీనివాస్‌

న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చట్టం (ఐబీసీ) వచ్చిన రెండేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏల పరిష్కారానికి అవకాశం ఏర్పడినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ తెలిపారు. ఐబీసీ 2016 డిసెంబర్‌ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాగా, ఇప్పటి వరకు 9,000 ఎన్‌పీఏ కేసులు ఈ చట్టం కింద పరిష్కారం కోసం వచ్చినట్టు ఆయన చెప్పారు. మొత్తం రూ.3 లక్షల కోట్ల ఎన్‌పీఏలపై ఐబీసీ ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం ఉందన్నారు. 3,500 కేసులు ముందస్తు అనుమతి దశలోనే పరిష్కారం అయ్యాయని, ఈ మొత్తం రూ.1.2 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఐబీసీ కింద కేసులను ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తర్వాత చేపట్టడం జరుగుతుందని గుర్తు చేశారు. ‘‘1,300 కేసులు ఐబీసీ కింద నమోదయ్యాయి. 400 కేసుల్లో దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసింది. 60 కేసుల్లో పరిష్కార ప్రణాళికలు ఆమోదం పొందాయి. 240 కేసుల్లో లిక్విడేషన్‌ (ఆస్తుల విక్రయం) ఆదేశాల అమలు ప్రారంభమైంది. 126 కేసులుల అప్పీల్‌ దశలో ఉన్నాయి. ఈ కేసులకు సంబంధించి రూ.71,000 కోట్ల వసూలుకు పరిష్కారం లభించింది’’ అని ఇంజేటి శ్రీనివాస్‌ ఐబీసీ తాలుకూ ప్రగతిని వివరించారు. రూ.50,000 కోట్ల మేర కేసులు పరిష్కార చివరి దశలో ఉన్నట్టు తెలిపారు.



You may be interested

టీవీ, గృహోపకరణాల ధరలకు రెక్కలు

Monday 26th November 2018

7-8 శాతం మేర పెంపు పండుగలు ముగియడంతో అమల్లోకి న్యూఢిల్లీ: టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ వ్యయాలు పెరిగినప్పటికీ ఇటీవల పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు రేట్ల పెంపును కాస్తంత వాయిదా వేసుకున్నాయి. దీంతో వాటి మార్జిన్లపై ప్రభావం ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కంపెనీలపై భారం పెరిగేలా చేసింది. ఈ పరిస్థితులను అధిగమించి, తమ మార్జిన్లను బలోపేం చేసుకునేందుకు కంపెనీలు ధరల

మార్చి నాటికి ఏఐఏటీఎస్‌ఎల్‌ అమ్మకం

Monday 26th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా అనుబంధ కంపెనీ ఏఐఏటీఎస్‌ఎల్‌ విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి (వచ్చే ఏడాది మార్చి కల్లా) పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విక్రయ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి త్వరలోనే మర్చంట్ బ్యాంకర్స్‌ నుంచి బిడ్లను ఆహ్వానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ దీనికి మంచి స్పందన వచ్చిన పక్షంలో.. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో కొంతైనా సాధించేందుకు తోడ్పడగలదు.

Most from this category