STOCKS

News


ఆధార్‌ బయటపెడితే నష్టమేం లేదు: ఆర్‌ఎస్‌ శర్మ

Friday 12th October 2018
news_main1539318870.png-21076

న్యూఢిల్లీ: ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ మరోసారి ఆధార్‌ గోప్యతపై తన అభిప్రాయాలను గట్టిగా వినిపించారు. ఆధార్‌ నంబర్‌ను బయటపెట్టడం వల్ల డిజిటల్‌ పరంగా వచ్చే ముప్పేదీ లేదన్నారు. తన ఆధార్‌ నంబర్‌ ప్రకటించి, దీన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో చూపించండంటూ శర్మ గతంలో సవాల్‌ విసిరి వార్తల్లో నిలిచిన విషయం గమనార్హం. ఆధార్‌ గోప్యత అనే అంశం చుట్టూ ఇంత కాలం జరిగిన చర్చలకు, ఎన్నో ప్రశ్నలకు ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడినట్టయిందని శర్మ చెప్పారు. ‘‘నా ఆధార్‌ సవాల్‌కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నా ఆధార్‌ ఇప్పటికీ ప్రజలకు తెలుసు. అయినా ఎవరూ ఏ హానీ చేయలేరు. ఆధార్‌ను వెల్లడించడం డిజిటల్‌ దాడులకు దారితీయదు’’ అని శర్మ ఓ వార్తా సంస్థకు తెలిపారు. శర్మ గతంలో యూఐడీఏఐ చైర్మన్‌గా పనిచేశారు. అప్పటి నుంచీ కూడా ఆధార్‌ భద్రత, గోప్యతకు ఎటువంటి భయం లేదని సమర్థిస్తూ వస్తూనే ఉన్నారు. ‘‘ఆధార్‌ నమోదు, ప్రాసెసింగ్‌, జారీ ఏదీ గోప్యతను ఉల్లంఘించదు. ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం పూర్తి స్తాయి విచారణ అనంతరం ఆధార్‌ గోప్యతను ఉల్లంఘించదంటూ తీర్పు ఇచ్చిన విషయాన్ని విమర్శకులు ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి’’ అని శర్మ పేర్కొన్నారు. 



You may be interested

గూగుల్ ఇండియా లాభాలు 33% అప్‌

Friday 12th October 2018

న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ భారత విభాగం ఆదాయాలు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.9,338 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.7,239 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. మరోవైపు, నికర లాభం 33 శాతం పెరిగి రూ. 307 కోట్ల నుంచి రూ. 407 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ టోఫ్లర్‌ ఈ

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై అధ్యయానికి ఐసీఏఐ కమిటీ

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను కేంద్రం చక్కదిద్దే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో.. దీనికి దారి తీసిన వ్యవస్థాగత అంశాలను అధ్యయనం చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) నిర్ణయించింది. ఇందుకోసం తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో వ్యవస్థాగత అంశాలను అధ్యయనం చేసి, వాటిని సరిదిద్దేందుకు.. వ్యవస్థను చక్కబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుందని ఐసీఏఐ పేర్కొంది. గత

Most from this category