STOCKS

News


బడ్జెట్‌తో ప్రభావితమయ్యే రంగాలు ఇవే!

Wednesday 30th January 2019
news_main1548846007.png-23904

రాబోయే బడ్జెట్‌లో ప్రజాకర్షక విధానాలకు పెద్దపీట ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌తో ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలు, వాటిలోని కీలక కంపెనీలపై అనలిస్టుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...
1. అగ్రి, టెక్స్‌టైల్‌, ఫుట్‌వేర్‌: 
- గ్రామీణ అగ్రి మార్కెట్స్‌, క్రిషి సిచాయ్‌ యోజనకు కేటాయింపులు పెరగవచ్చు. సాగు రంగానికి సంస్థాగత రుణపరిమితిని రూ. 11 లక్షల కోట్ల నుంచి పెంచవచ్చు. దీంతో పైప్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలకు లబ్ది కలుగుతుంది. ఫినొలెక్స్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, మారికో, హీరోమోటో కార్‌‍్ప కంపెనీల షేర్లను పరిశీలించవచ్చు. 
- ఎరువులపై కస్టమ్స్‌ డ్యూటీని తగ్గించవచ్చు. దీంతో జీఎస్‌ఎఫ్‌సీ, యూపీఎల్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌కు మేలు కలిగే అవకాశముంది.
- సిల్కు దిగుమతులపై పది శాతం సుంకం విధించే యోచన ఉంది. టెక్స్‌టైల్‌ యంత్రాలపై సుంగాన్ని తగ్గించవచ్చు. ఫుట్‌వేర్‌ రంగంలో జీఎస్‌టీ తగ్గింపులుంటాయని అంచనా. దీంతో బాటా, రిలాక్సో, ట్రైడెంట్‌, అర్వింద్‌, నితిన్‌ స్పిన్నర్స్‌, సియారామ్‌, కేఆర్‌పీ మిల్స్‌కు పాజిటివ్‌గా ఉండొచ్చు.
2. బ్యాంకులతో సహా వినియోగ రంగాలు:
- సాగురంగానికి ప్యాకేజీ లేదా ఆదాయ పన్ను పరిమితి తగ్గింపులాంటి ప్రకటనలు డిమాండ్‌ను విపరీతంగా పెంచవచ్చు. దీంతో ఐటీసీ, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, డాబర్‌లాంటి కంపెనీలు లాభపడతాయి.
- ఆటో రంగానికి సంబంధించి ఈ వాహనాలపై ఇస్తున్న రాయితీని కొనసాగించవచ్చు. దీంతో ఆశోక్‌లేలాండ్‌, బజాజ్‌ఆటో, ఎంఅండ్‌ఎంకు పాజిటివ్‌ ఫలితాలుంటాయి.
- వినిమయ వ్యయాలు పెరిగితే ప్రైవేట్‌ బ్యాంకులకు మేలు. ఈ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ను పరిశీలించవ్చు. 
- క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌ ప్రకటన వస్తే పీఎస్‌యూ బ్యాంకులు దూసుకుపోతాయి. 
- ఆదాయపన్ను పరిమితి తగ్గితే బంగారం కొనుగోళ్లు పెరిగి జువెలరీ కంపెనీలకు, ఎల్‌ఐసీ లాంటి బీమా రంగ కంపెనీలకు లబ్ది కలుగుతుంది. 
3. ఇన్‌ఫ్రా:
- మౌలికవసతుల రంగానికి బడ్జెట్లో భారీ కేటాయింపులుండొచ్చు. గతేడాది ఈ రంగానికి కేటాయింపులు దాదాపు 21 శాతం పెంచారు. ఈ దఫా మరింత పెరుగుదల ఉండొచ్చు. దీనివల్ల ఎల్‌అండ్‌టీ, భెల్‌, థర్మాక్స్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, సీమెన్స్‌ కంపెనీలు పాజిటివ్‌గా ప్రభావితమవుతాయి. 
- రక్షణరంగ కేటాయింపులు పెరిగితే బెల్‌, భారత్‌ఫోర్జ్‌, భారత్‌ డైనమిక్స్‌ లాంటి కంపెనీలు లాభపడతాయి. 
4. సిమెంట్‌, స్టీల్‌: పెట్‌కోక్‌పై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గిస్తే సిమెంట్‌ కంపెనీలకు లాభదాయకం. గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌పై కస్టమ్స్‌ సుంకం తగ్గిస్తే హెచ్‌ఈజీ, గ్రాఫైట్‌ ఇండియాలకు లబ్ది చేకూరుతుంది.
5. రియల్టీ: నిర్మాణం జరుగుతున్న కట్టడాలకు సంబంధించి జీఎస్‌టీ రేట్లలో మార్పులుంటాయని అంచనాలున్నాయి. ఇదే నిజమైతే రియల్టీ రంగానికి జోష్‌ వస్తుంది.You may be interested

ఈ ఏడాది మిడ్‌క్యాప్స్‌ హవా!

Thursday 31st January 2019

గతేడాది మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ‍స్టాక్స్‌ ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేశాయి. అయితే, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాలు బోటమ్‌ అవుట్‌ అయ్యాయయని, వీటిల్లో ఈ ఏడాది రికవరీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది సెన్సెక్స్‌ 6 శాతం, పెరిగితే, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 13 శాతం మేర పడిపోయింది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ అయితే 23 శాతం తగ్గింది. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే సగటున 8 శాతం తక్కువకు

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Wednesday 30th January 2019

జనవరి డెరివేటివ్స్‌ కాంట్రాక్టు రేపు(గురువారం) ముగియనుండటం, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై నేడు నిర్ణయాన్ని ప్రకటించనుండటం, కేంద్రం ప్రభుత్వం ఎల్లుండి(శుక్రవారం) మధ్యంతర ఒడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న అంశాల నేపథ్యంలో బుధవారం ఆద్యంతం స్టాక్‌ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 1 పాయింటు కోల్పోయి 35,591 వద్ద, నిఫ్టీ అరపాయింట్ల నష్టపోయి 10,651.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 359 పాయిం‍ట్ల రేంజ్‌ 35,491 - 35,850 పాయింట్ల రేంజ్‌ కదలాడింది.

Most from this category