STOCKS

News


నియామకాల్లో మహిళలకు రెడ్‌ కార్పెట్‌

Wednesday 12th December 2018
news_main1544591605.png-22845

ముంబై:  వచ్చే ఏడాది మహిళా ఉద్యోగుల నియామకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2019లో మహిళల హైరింగ్ 15-20 శాతం మేర పెరగనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీపుల్‌స్ట్రాంగ్‌ తెలియజేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ .. ఫైనాన్షియల్ సర్వీసెస్‌ .. ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్ఐ), ఆటోమోటివ్‌, ఐటీ, సాఫ్ట్‌వేర్‌, హాస్పిటాలిటీ.. ట్రావెల్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్లు 'ది ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్ 2019' పేరిట రూపొందించిన నివేదికలో పీపుల్‌స్ట్రాంగ్‌ తెలియజేసింది. సుమారు 15 రంగాలకు చెందిన 1,000 పైగా సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. నిర్దిష్ట హోదాలకు సంబంధించి సుశిక్షితులైన వారి సంఖ్య తక్కువగా ఉండటం, సామాజిక కట్టుబాట్లు, పని ప్రదేశాల్లో భద్రత తదితర అంశాలు సైతం మహిళల నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు పీపుల్‌స్ట్రాంగ్ వ్యవస్థాపకుడు దేవాశీష్ శర్మ చెప్పారు. మహిళల నియామకాలను ప్రోత్సహించేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు. మహిళల ఉద్యోగిత క్రమంగా పెరుగుతోందంటూ ‘‘2017లో 38 శాతంగా ఉన్న ఉద్యోగిత.. 2018లో 46 శాతానికి చేరింది. కానీ ఇప్పటికీ మహిళా జనాభాతో పోలిస్తే వారి ప్రాతినిధ్యం చాలా తక్కువగానే ఉంటోంది’’ అని శర్మ వివరించారు. ఉద్యోగులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే టాప్‌ 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఆఖరున ఉంది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ ఈ లిస్టులో ఈ ఏడాది కొత్తగా చోటు దక్కించుకున్నాయి. 



You may be interested

ఇండియన్‌ బ్యాంక్‌పై రూ.కోటి జరిమానా

Wednesday 12th December 2018

ముంబై: ‘మోసాలు - వర్గీకరణ, నివేదిక’కు సంబంధించి వాణిజ్య బ్యాంకులు పాటించవలసిన ఆదేశాలను ఇండియన్‌ బ్యాంక్‌ పాటించలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఇందులో భాగంగా సైబర్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.కోటి జరిమానా విధించింది. నవంబర్‌ 30, 2018న బ్యాంకుకు ఇచ్చినటువంటి ఉత్తర్వు ద్వారా ఈ మేరకు పెనాల్టీ విధించినట్లు వెల్లడించింది. ఆర్‌బీఐ జారీచేసిన మార్గదర్శకాలు, ఆదేశాలను పాటించనందుకు.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 ప్రకారం ఈ

మాల్యా నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి సెటిల్మెంట్‌కు సంబంధించి అధికారికంగా తమకు ఎలాంటి ఆఫర్‌ రాలేదని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టంచేశారు. "కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు రుణాలు మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్‌బీఐ సారథ్యం వహిస్తోంది. మాల్యా భారత్‌కు తిరిగి వస్తే రుణాల రికవరీ ప్రక్రియ వేగం కాగలదని చెప్పారాయన. తీసుకున్న రుణాల్లో అసలును

Most from this category