STOCKS

News


పేదరిక నిర్మూలనకు అధిక వృద్ధి రేటు కావాలి

Friday 16th November 2018
news_main1542347622.png-22077

న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనకు, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేందుకు అధిక వృద్ధి రేటు తప్పనిసరి అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సేవింగ్స్‌ అండ్‌ రిటైల్‌ బ్యాంక్స్‌ 25వ ప్రపంచ కాంగ్రెస్‌ సదస్సులో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికంటూ అభివృద్ధి ప్రయోజనాల స్వచ్ఛందంగా వేచి చూడటం మనలాంటి ఆకాంక్షలతో కూడిన సమాజానికి సరిపోదు. దానికి మనలాంటి ఆర్థిక వ్యవస్థలకు అధిక వృద్ధి రేటు కావాలి. అధిక శాతం ప్రజలను పేదరికం నుంచి బయటపడేసేందుకు, వారి జీవన ప్రమాణాల ఉన్నతికి అభివృద్ధిని ఓ సాధనంగా వినియోగించుకోవాలి. అదే సమయంలో, అభివృద్ధి, ప్రగతి ఫలాలు కొందరికే లబ్ధి కలిగిస్తూ, చాలా మందిని దీనికి దూరంగా ఉంచుతున్న ప్రమాదాల పట్ల స్పృహతోనే ఉన్నాం’’ అని జైట్లీ వివరించారు. వృద్ధి తాలూకూ ప్రభావం అందరినీ చేరుకునేందుకు సమయం పడుతుందన్నారు. 2014 నుంచి మోదీ సర్కారు చేపట్టిన ఆర్థిక సేవల విస్తృతిపై మాట్లాడుతూ... ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు 33 కోట్ల ఖాతాలను ప్రారంభించాయని చెప్పారు. జీరో బ్యాలన్స్‌ ఖాతాల్లో ప్రజలు డిపాజిట్లు చేయడం మొదలెట్టారని, ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కూడా కల్పించామని తెలియజేశారు. మన దేశంలో ప్రధానంగా బీమా, పెన్షన్‌ సదుపాయాలు అందరికీ లేకపోవడంతో... చౌక ప్రీమియానికే బీమా సదుపాయం కల్పించామన్నారు. ప్రమాద బీమా కింద 14.1 కోట్ల మంది, జీవిత బీమా పథకం కింద 5.5 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు తెలిపారు. తక్కువ ప్రీమియం పెన్షన్‌ పాలసీ అటల్‌ పెన్షన్‌ యోజనను కూడా తీసుకొచ్చినట్టు చెప్పారు. రుణ సదుపాయం లేని వారిని దృష్టిలో ఉంచుకుని ముద్రా పథకాన్ని తీసుకొచ్చామన్నారు. 



You may be interested

రిలయన్స్‌ ఇన్‌ఫ్రా నికర లాభం 49 శాతం డౌన్‌

Friday 16th November 2018

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 49 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.544 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.277 కోట్లకు తగ్గిందని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ క్యూ2లో రూ.4,200 కోట్ల మేర వన్‌ టైమ్‌ కేటాయింపులు జరిపామని, ఈ కేటాయింపులు లేకుంటే నికర లాభం 723 శాతం

బెంగళూరులో ఇంటెల్‌ కొత్త డిజైన్‌ కేంద్రం

Friday 16th November 2018

న్యూఢిల్లీ: చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌... బెంగళూరులోని తన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిజైన్‌ సెంటర్ ‘ఎస్‌ఆర్‌ఆర్‌4’’ను గురువారం కేంద్ర మంత్రి మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. ఈ కేంద్రంపై ఇంటెల్‌ రూ.1,100 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టింది. దీంతో భారత్‌లో ఇంటెల్‌ పరిశోధన, అభివృద్ధి మరింత విస్తృతం కానుంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ల్యాబ్‌, మొత్తం 6.2 లక్షల చదరపు అడుగుల పరిధిలో హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌

Most from this category