STOCKS

News


ప్రభుత్వ సంస్కరణలతో ఆశించిన ఫలితాలు: ఉపరాష్ట్రపతి

Monday 17th December 2018
news_main1545034908.png-22994

న్యూఢిల్లీ: జీఎస్టీ, నల్లధనంపై చట్టం, దివాలా కోడ్‌ ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా ఆర్థికంగా క్షీణత చవిచూస్తేంటే భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్‌ వైపు వస్తే పన్ను రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు నోట్ల రద్దును సమర్థిస్తూ... దీని ఉద్దేశ్యం నెరవేరిందన్నారు. తలగడల కింద, స్నానాల గదుల్లో దాగి ఉన్న నోట్ల కట్టలు బ్యాంకుల్లోకి వచ్చినట్టు చెప్పారు. ‘‘మొత్తం నగదును బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురావడమే నోట్ల రద్దు ఉద్దేశ్యం. అది చాలా వరకు నెరవేరింది’’అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. 



You may be interested

వన్నె తగ్గిన పసిడి

Monday 17th December 2018

డాలర్‌ ర్యాలీతో ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి వన్నె తగ్గింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు నష్టపోయి 1241.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచఆర్థిక వృద్ధి నెమ్మదించటం, ఈ వారంలో జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశంలో వడ్డీరేట్ల పెంపు ప్రకటనపై మార్కెట్‌ వర్గాల ఆశావహన ధోరణి డాలర్‌కు బలానిస్తున్నాయి. డాలర్‌ స్థిరమైన ర్యాలీతో పసిడి శుక్రవారం పతనస్థాయి నుంచి ఇంకా కోలుకోలేదు. ఇటీవల విడుదలైన చైనా, యూరప్‌

35,800 మద్దతు కీలకం

Monday 17th December 2018

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా, ప్రపంచ మార్కెట్ల నెగిటివ్‌ ట్రెండ్‌ వంటి పలు ప్రతికూలాంశాల నడుమ గతవారం మన మార్కెట్‌ ఆశ్చర్యకరంగా లాభాలతో ముగిసింది. అంతేకాకుండా ఇక్కడి స్టాక్‌ మార్కెట్‌ ఒడుదుడుకుల్ని సూచించే వీఐఎక్స్‌ (వొలటాలిటీ ఇండెక్స్‌) 22.5 స్థాయి నుంచి 16 పాయింట్లలోపునకు పడిపోయింది. నవంబర్‌ నెలలో నిఫ్టీ 10,000 పాయింట్ల నుంచి 10,940 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపిన తరుణంలో

Most from this category