STOCKS

News


జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు..!

Wednesday 3rd October 2018
news_main1538542571.png-20811

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వచ్చే నెలలో రూ.లక్ష కోట్లను మించిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వరుసగా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో జీఎస్‌టీ ఆదాయం లక్ష కోట్ల మార్కును దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. పండుగల సీజన్‌ కావడం వల్ల ఈ రెండు నెలల్లో వస్తు, సేవల డిమాండ్‌ పెరిగి వసూళ్లు ఊపందుకోనున్నాయని భావిస్తోన్న ఆర్థిక శాఖ.. ఇదే సమయంలో పన్ను ఎగవేతలకు ఉన్నటువంటి అవకాశాలను అరికట్టడం ద్వారా రూ.లక్ష కోట్ల వసూళ్లను సునాయాసంగా అందుకోవచ్చని ప్రణాళిక వేసినట్లు వెల్లడైంది. సెప్టెంబర్‌ వసూళ్లు రూ.94,442 కోట్లు ఉండడం కూడా ప్రభుత్వ అంచనాలకు బలానిస్తోంది. ‘రానున్నది పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడం.. వర్తకులు భారీ డిస్కౌంట్లను ప్రకటించనుండడం ఆధారంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటేందుకు అవకాశం ఉంది.’ అని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సంస్థ చార్టర్డ్ అకౌంటెంట్‌ రజత్ మోహన్ అన్నారు. 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం .. బ్యాంకులకు వరం

Wednesday 3rd October 2018

ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) సంక్షోభం మరింతగా ముదురుతుండటం.. వాణిజ్య బ్యాంకులకు వరంగా మారొచ్చని సింగపూర్‌కి చెందిన బ్రోకింగ్ సంస్థ డీబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. దీన్ని అవకాశంగా మల్చుకుని బ్యాంకులు మళ్లీ కార్పొరేట్ల రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల రుణ అవసరాలు తీర్చేందుకు బ్యాంకులే ప్రధాన వనరుగా మారవచ్చని వివరించింది. మొండిబాకీల సమస్యలతో 11 ప్రభుత్వ

గంటకు 15 డాలర్లు!

Wednesday 3rd October 2018

సియాటిల్: ఆన్‌లైన్‌ రిటైల్ దిగ్గజం అమెజాన్‌.. అమెరికాలోని తమ సిబ్బంది కనీస వేతనాలను పెంచింది. వచ్చే నెల నుంచి గంటకు 15 డాలర్ల (సుమారు రూ.1,050) చొప్పున కనీస వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. దాదాపు 3,50,000 మంది ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌, తాత్కాలిక ఉద్యోగులకు దీనితో ప్రయోజనం చేకూరనున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఇప్పటికే గంటకు 15 డాలర్ల వేతనం పొందుతున్నవారికి కూడా తగు స్థాయిలో పెంపు ఉంటుందని తెలిపింది. కంపెనీలో పై

Most from this category