STOCKS

News


రూ.లక్ష కోట్ల వసూళ్లతో జీఎస్‌టీ బోణి

Friday 1st February 2019
Markets_main1549008833.png-23948

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జనవరి నెలలో రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2019 జనవరి స్థూల వసూళ్లు అంచనాల మేరకు నమోదయ్యాయి. డిసెంబర్‌లో నెలలో ఉన్న రూ.94,725 కోట్లు, నవంబర్‌లో ఉన్న రూ.89,825 కోట్లతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. ‘‘రైతులు, పేదలు, మధ్యతరగతికి ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్‌టీ కౌన్సిల్‌ పలు వస్తు సేవలపై పన్ను తగ్గించినప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్న కారణంగా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించాయి’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.



You may be interested

ఎస్‌బీఐ లాభం రూ. 3,955 కోట్లు

Friday 1st February 2019

అంచనాలను మించిన ఫలితాలు మెరుగుపడిన ఆస్తుల నాణ్యత దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ మూడో త్రైమాసికంలో రూ. 3,955 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ప్రొవిజన్లు తగ్గుముఖం పట్టడం, ఎన్‌ఐఐ మంచి వృద్ధి నమోదు కావడంతో బ్యాంకు లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయానికి బ్యాంకు రూ. 2416 కోట్ల నష్టం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే లాభంలో 318.5 శాతం పెరుగుదల నమోదయింది. క్యు3లో లాభం 3,318 కోట్లు, ఎన్‌ఐఐ రూ. 21,902

వృద్ధి రేట్లు పెరిగాయ్‌...

Friday 1st February 2019

- 2016-17, 2017-18పై సవరణ గణాంకాలు న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల వృద్ధి రేట్లను కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ) ఎగువ ముఖంగా సవరించింది. వీటిని క్లుప్తంగా చూస్తే... - 2017-18లో వృద్ధి రేటు తొలి గణాంకాల ప్రకారం 6.7 శాతం. తాజాగా ఈ రేటును 7.2 శాతానికి సవరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులకు సంబంధించి తాజా గణాంకాల సానుకూలత దీనికి

Most from this category