STOCKS

News


జీఎస్టీ వసూళ్లు మళ్లీ లక్ష కోట్లు

Friday 2nd November 2018
news_main1541141345.png-21657

- ఐదు నెలల తర్వాత అక్టోబర్‌లో రూ.1,00,710 కోట్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు ఐదు నెలల తర్వాత మళ్లీ లక్షకోట్లు దాటాయి. పండుగల సీజన్‌, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఆర్థికమంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- అక్టోబర్‌లో రూ. 1,00,710 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరిగాయి. వ్యాపార విభాగానికి సంబంధించి 67.45 లక్షల  రిటర్న్స్‌ దాఖలయ్యాయి. కేరళ (44 శాతం) జార్ఖండ్‌ (20 శాతం) రాజస్థాన్‌ (14 శాతం) ఉత్తరాఖండ్‌ (13 శాతం) మహారాష్ట్ర (11 శాతం) జీఎస్‌టీ వసూళ్ల మంచి పనితనాన్ని ప్రదర్శించాయి.

లక్ష కోట్ల లక్ష్యం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరగాలన్నది కేం‍ద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్‌ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు. మేలో ఈ వసూళ్లు రూ.95,016 కోట్లు, జూన్‌లో రూ.95,610 కోట్లు, జూలైలో రూ.96,483 కోట్ల వసూళ్లు జరిగాయి.  ఆగస్టులో ఈ వసూళ్లు రూ.93,960 కోట్లు. సెప్టెంబర్‌లో రూ.94,442 కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో జూలై 27వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఫ్రిజ్‌లు, స్మాల్‌ స్క్రీన్స్‌సహా 88 వస్తువులపై జీఎస్‌టీ కౌన్సిల్‌ కోత విధించింది. దీనితో 35 వస్తువులు మాత్రమే 28 శాతం అధిక పన్ను బ్రాకెట్‌లో ఉన్నాయి.You may be interested

హెచ్‌పీసీఎల్‌ లాభం 37శాతం డౌన్‌

Friday 2nd November 2018

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 37 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,735 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,092 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. ముడి చమురు ధరలు పెరగడం,  రిఫైనింగ్‌ మార్జిన్‌లు తక్కువగా ఉండడం, విదేశీ మారక ద్రవ్య నష్టాల వల్ల నికర లాభం 37 శాతం తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ముకేశ్‌

వ్యాపారాలను వదలని అవినీతీ

Friday 2nd November 2018

కంపెనీ మనుగడ సాగించాలంటే తప్పదు కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే ఇచ్చుకోవాలి 52 శాతం కంపెనీల ప్రతినిధుల అభిప్రాయమిదే వర్ధమాన మార్కెట్లపై ఈవై సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: లంచాలు, అక్రమార్జన అనేవి భారత్‌ సహా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నిర్వహించిన సర్వేలో తేలిసింది. వ్యాపారాల్లో అవినీతి, లంచాలు తారస్థాయిలో ఉన్నాయని ఈవై సర్వేలో 52 శాతం మంది చెప్పడం గమనార్హం. మన దేశంలోనూ 40 శాతం మంది ఇదే

Most from this category