STOCKS

News


సెప్టెంబర్‌ జీఎస్‌టీ వసూళ్లలో స్వల్ప వృద్ధి!

Tuesday 2nd October 2018
news_main1538450945.png-20771

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో స్వల్పంగా పెరిగి రూ.94,442 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్టులో ఈ వసూళ్లు రూ.93,960 కోట్లు. అయితే సెప్టెంబర్‌ తరువాతి నెలల్లో ఈ వసూళ్లు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి. పండుగల సీజన్‌, అధిక అమ్మకాలకు అవకాశాలే దీనికి కారణం. 67 లక్షల వ్యాపార వర్గాల నుంచి సెప్టెంబర్‌లో తాజా డిపాజిట్లు వచ్చినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 
వేర్వేరుగా చూస్తే....
విడివిడిగా చూస్తే, సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) వాటా రూ.15,318 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) వాటా రూ.21,061 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) వాటా రూ.50,070 కోట్లు (దిగుమతులపై రూ. 25,305కోట్లు కలిపి), సెస్‌ రూ.7,993 కోట్లు (దిగుమతులపై రూ.769 కోట్లు).
లక్ష కోట్ల లక్ష్యం మిస్‌?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరగాలన్నది కేం‍ద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్‌ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు. మేలో ఈ వసూళ్లు రూ.95,016 కోట్లు, జూన్‌లో రూ.95,610 కోట్లు, జూలైలో రూ.96,483 కోట్ల వసూళ్లు జరిగాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో జూలై 27వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఫ్రిజ్‌లు, స్మాల్‌ స్క్రీన్స్‌సహా 88 వస్తువులపై జీఎస్‌టీ కౌన్సిల్‌ కోత విధించింది. దీనితో 35 వస్తువులు మాత్రమే 28 శాతం అధిక పన్ను బ్రాకెట్‌లో ఉన్నాయి. 



You may be interested

మొండిబాకీలు తగ్గాయ్‌..

Tuesday 2nd October 2018

ముంబై: గడిచిన ఏడాది కాలంగా మొండిబాకీలు గణనీయంగా తగ్గాయని, ‍అసెట్ క్వాలిటీ అంచనాలు స్థిర స్థాయిలోనే ఉన్నాయని ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ వెల్లడించింది. "గడిచిన కొద్ది రోజులుగా బ్యాంకు అసెట్ క్వాలిటీ గురించి కొన్ని నిరాధార ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చిన సంగతి మేనేజ్‌మెంట్ దృష్టికి వచ్చింది. అయితే, అలాంటి పరిస్థితేమీ లేదని అసెట్ క్వాలిటీ స్థిరంగానే ఉందని యాజమాన్యం స్పష్టం చేయదల్చుకుంది" అని స్టాక్ ఎక్స్చేంజీలకు బ్యాంకు తెలియజేసింది.

హెడ్‌డీఎఫ్‌సీ రిటైల్‌ రుణ రేటు పెంపు!

Tuesday 2nd October 2018

ముంబై: దేశ అతిపెద్ద మార్టిగేజ్‌ ఫైనాన్షియర్‌ హెచ్‌డీఎఫ్‌సీ తన రిటైల్‌ రుణ రేటును (ఆర్‌పీఎల్‌ఆర్‌) 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. దీనితో రుణాలకు సంబంధించి వివిధ శ్లాబ్స్‌పై కొత్త రేట్లు 8.80 - 9.05 శ్రేణిలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ నిర్ణయం నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయం తీసుకుంది.  అమల్లోకి పీఎన్‌బీ

Most from this category