STOCKS

News


మౌలిక రంగం గ్రూప్‌ నత్తనడక

Tuesday 2nd April 2019
news_main1554178879.png-24916

- ఫిబ్రవరిలో కేవలం 2.1 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలికరంగం ఫిబ్రవరిలో మందగమనంలో ఉంది. వృద్ధి కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. క్రూడ్‌ ఆయిల్‌, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో బలహీన ధోరణి దీనికి కారణం.  2018 ఇదే నెలలో ఈ గ్రూప్‌ వృద్ధి రేటు 5.4 శాతం. సోమవారం విడుదలైన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం...
- క్రూడ్‌ ఆయిల్‌, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా వరుసగా -6.1 శాతం, -0.8 శాతం చొప్పున  క్షీణించాయి. 
- ఎరువులు (5.2 శాతం నుంచి 2.5 శాతం), స్టీల్‌ (5 శాతం నుంచి 4.9 శాతం), సిమెంట్‌ (23 శాతం నుంచి 8 శాతం) విద్యుత్‌ (4.6 శాతం నుంచి 0.7 శాతం) రంగాల ఉత్పత్తుల్లో వృద్ధి ఉన్నప్పటికీ ఈ రేటు తగ్గింది.
- అయితే బొగ్గు, సహజ వాయువుల రంగాల్లో మాత్రం వృద్ధి 7.3 శాతం, 3.8 శాతం చొప్పున నమోదయ్యాయి. 
- ‍కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి నెలల్లో చూస్తే, మౌలిక రంగం వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. 
- మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో ఈ ఎనిమిది పరిశ్రమల వాటా 41 శాతం. ఐఐపీ ఫిబ్రవరి గణాంకాలు ఈ నెల రెండవ వారంలో వెలువడతాయి.
తాజా గణాంకాల ప్రతికూల ప్రభావం ఐఐపీపైనా ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 



You may be interested

ప్రభుత్వ రెండవ పెద్ద బ్యాంకు... బీఓబీ

Tuesday 2nd April 2019

- దేనా, విజయా బ్యాంకుల విలీనం నేపథ్యం - ఎస్‌బీఐ తరువాతి స్థానం - దీనితో మూడవ స్థానంలోకి పీఎన్‌బీ - 18కి తగ్గిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య న్యూఢిల్లీ: దేశంలో ప్రభుత్వ రంగ రెండవ బ్యాంకింగ్‌ దిగ్గజంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) అవతరించింది. దేనా, విజయాబ్యాంకుల విలీనం ఏప్రిల్‌ 1 నుంచీ లాంఛనంగా అమల్లోకి రావడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తరువాత బీఓబీ రెండవ స్థానంలోకి చేరింది. దీనితో

వాహన విక్రయాలకు డిమాండ్‌ దెబ్బ

Tuesday 2nd April 2019

వాహన విక్రయాలకు డిమాండ్‌ దెబ్బ - సింగిల్ డిజిట్‌ వృద్ధికే దిగ్గజాలు పరిమితం - 2018-19లో డిమాండ్‌ తగ్గుదల న్యూఢిల్లీ:- దాదాపు తొమ్మిది నెలల పాటు డిమాండ్ తగ్గుదలతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. మారుతీ సుజుకీ 2018-19లో రికార్డు స్థాయిలో మొత్తం 18,62,449 యూనిట్లు విక్రయించినప్పటికీ.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే

Most from this category