News


ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 16.7 శాతం వృద్ధి

Friday 5th October 2018
news_main1538713703.png-20875

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య స్థూలంగా 16.7 శాతం పెరిగాయి. విలువలో రూ.5.47 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే కాలంలో రిఫండ్స్‌ విలువ రూ.1.03 లక్షల కోట్లు. గత ఏడాది ఈ కాలంలో జరిగిన రిఫండ్స్‌కన్నా ఇది 30.4 శాతం అధికం. దీనితో నికర వసూళ్లు (రిఫండ్స్‌ సర్దుబాటు అనంతరం) 14 శాతం వృద్ధితో రూ.4.44 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, రూ.11.50 లక్షల కోట్ల వసూళ్లు జరగాలన్నది కేంద్ర బడ్జెట్‌ లక్ష్యం. దీనితో పోల్చితే ఇప్పటి వరకూ 38.6 శాతం వసూళ్లు జరిగాయన్నమాట. 
జీఎస్‌టీ వసూళ్లు లక్ష్యం తప్పే అవకాశం 
పరోక్ష పన్నుల విషయానికి వస్తే, సెప్టెంబర్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు  స్వల్పంగా పెరిగి రూ.94,442 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్టులో ఈ వసూళ్లు రూ.93,960 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరగాలన్నది కేం‍ద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్‌ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు. మేలో ఈ వసూళ్లు రూ.95,016 కోట్లు, జూన్‌లో రూ.95,610 కోట్లు, జూలైలో రూ.96,483 కోట్ల వసూళ్లు జరిగాయి. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో జూలై 27వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఫ్రిజ్‌లు, స్మాల్‌ స్క్రీన్స్‌సహా 88 వస్తువులపై జీఎస్‌టీ కౌన్సిల్‌ కోత విధించింది. దీనితో 35 వస్తువులు మాత్రమే 28 శాతం అధిక పన్ను బ్రాకెట్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  జీఎస్‌టీ వసూళ్ల అంచనాలు సఫలీకృతం కావడంపై అనుమానాలు నెలకొంటున్నాయి. 



You may be interested

పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం

Friday 5th October 2018

వాషింగ్టన్‌: అవినీతి చర్యలకు పాల్పడిన పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. మోసపూరిత విధానాలకు పాల్పడిన మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌పై రెండేళ్ల వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన ఈ కంపెనీ... భారత్‌లో ప్రపంచ బ్యాంకుకు చెందిన ప్రాజెక్టులకు పనిచేస్తోంది. భారత్‌కు చెందిన ఓలివ్‌ హెల్త్‌కేర్‌, జే మోది కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఎంఎఫ్‌ నిర్వహణ ఆస్తులు 14% అప్‌

Friday 5th October 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్ (ఎంఎఫ్‌) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) విలువ ఆశాజనక వృద్ధిరేటును నమోదుచేసింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం వృద్ధి చెంది రూ.24 లక్షల కోట్లకు చేరినట్లు అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. క్రితం ఏడాది ఇదేకాలంలో దేశీ ఎంఎఫ్‌ల ఏయూఎం రూ.21 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ అంశంపై స్పందించిన ఎంఎఫ్‌ పరిశ్రమ వర్గాలు..

Most from this category