STOCKS

News


ఆర్‌బీఐపై ప్రభుత్వ ఒత్తిళ్లతో ఆర్థిక అస్థిరత

Tuesday 18th December 2018
news_main1545109231.png-23022

సింగపూర్‌: ఆర్‌బీఐపై ప్రభుత్వం అదే పనిగా చేస్తున్న తీవ్ర స్థాయి ఒత్తిడి అన్నది... బ్యాంకింగ్‌ రంగం మెరుగు కోసం చేస్తున్న గట్టి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని, దీర్ఘకాలంలో ఆర్థిక అస్థిరతకు దారితీస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ హెచ్చరించింది. 2019 జనవరిలో జరిగే ఆర్‌బీఐ సమావేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ నియంత్రణలో ఏవైనా మార్పులు చేస్తారేమో వేచి చూస్తున్నట్టు తెలిపింది. ఆర్‌బీఐ స్వతంత్రత సహా పలు అంశాల విషయంలో ప్రభుత్వంతో పొసగక ఉర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ప్రస్తుతం సెంట్రల్‌ బ్యాంకు స్వతంత్రత విషయంలో, ముఖ్యంగా పాలసీ అమలులో ఏ మార్పూ లేదని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ఎన్‌పీఏల గుర్తింపు, రీక్యాపిటలైజేషన్‌, పరిష్కారం, సంస్కరణలపై సెంట్రల్‌ బ్యాంకు దృష్టి సారించి ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఇది కచ్చితంగా రిస్క్‌ అని అభిప్రాయపడింది. ‘‘మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆస్తుల నాణ్యత సమీక్ష చేపట్టిన తర్వాత నుంచి, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు బ్యాంకింగ్‌ రంగలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచాయి’’అని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆర్‌బీఐ సర్క్యులర్‌ తర్వాత ఒత్తిడిలో ఉన్న రుణాల గుర్తింపు వేగవంతం అయిందని పేర్కొంది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌కు మరింత చేయాల్సి ఉంది. సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్‌ కోసం ఆర్‌బీఐ చేపట్టిన కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) తగిన విధంగానే ఉంది’’ అని ఎస్‌అండ్‌పీ తెలిపింది. 



You may be interested

'కోటక్ బ్యాంక్‌'కు కోర్టులో చుక్కెదురు

Tuesday 18th December 2018

ముంబై: ప్రమోటర్ల వాటా తగ్గింపునకు సంబంధించిన గడువు వివాదంలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ (కేఎంబీ)కి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన డిసెంబర్ 31 డెడ్‌లైన్‌పై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేఎంబీ దాఖలు చేసిన పిటీషన్‌పై వచ్చే ఏడాది జనవరి 17లోగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆర్‌బీఐని ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రమోటర్ల వాటాను పెయిడప్‌ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్‌లో 20 శాతానికి, 2020

సరికొత్త ప్లాటినా 110 @ రూ.49,197

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో నుంచి నూతన వెర్షన్‌ ప్లాటినా 110 సీసీ బైక్‌ సోమవారం మార్కెట్‌లో విడుదలైంది. యాంటీ-స్కిడ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ, ట్యూబ్‌లెస్‌ టైర్లు వంటి అధునాత ఫీచర్లను కలిగిన ఈ బైక్‌ ధర రూ.49,197 (ఢిల్లీ ఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. రోడ్లపై గతుకుల ఇబ్బంది అంతగా తెలియకుండా ఉండేలా అత్యాధునిక షాక్ అబ్జార్బర్స్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది. బైక్‌ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్)

Most from this category