STOCKS

News


అకౌంట్లతో పనిలేదు.. కోటిపై విత్‌డ్రాలపై 2 శాతం టీడీఎస్‌!

Friday 19th July 2019
news_main1563522944.png-27179

న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ జూలై 5వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2019-20 వార్షిక బడ్జెట్‌లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్‌ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్‌’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్‌డ్రాయెల్స్‌ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్‌) విధించాలని జూలై 5 బడ్జెట్‌ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్‌డ్రాయెల్స్‌ చేస్తే 2 శాతం టీడీఎస్‌ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్‌లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్‌ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్‌ నుంచి విత్‌డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్‌లో ఆర్థిక మంతి​ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ​ప్రతిపాదనకూ లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్‌ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్‌ ‍ప్రతిపాదన కల్పిస్తోంది. 



You may be interested

ప్రీమియం ఐస్‌ క్రీమ్స్‌ మార్కెట్లోకి డుమాంట్‌

Friday 19th July 2019

ఏడాదిలో 100 ఔట్‌లెట్ల ఏర్పాటు కంపెనీ ఎండీ వివేక్‌ అయినంపూడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం ఐస్‌ క్రీమ్‌ మార్కెట్లోకి కొత్త బ్రాండ్‌ ‘డుమాంట్‌’ ప్రవేశించింది. హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడలో 10 స్టోర్లను తెరిచిన ఈ కంపెనీ.. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో 100 ఔట్‌లెట్లను ప్రారంభించాలని కృతనిశ్చయంతో ఉంది. మూడ్లేళ్లలో ఈ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోనూ అడుగుపెడతామని డుమాంట్‌ ఎండీ వివేక్‌ అయినంపూడి తెలిపారు. గురువారమిక్కడ డుమాంట్‌ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా బ్రాండ్‌ డైరెక్టర్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం రూ.359 కోట్లు

Friday 19th July 2019

-15 శాతం వృద్ధితో రూ.2,485 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) గ్రూప్‌నకు చెందిన ఐటీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ ఇన్పోటెక్‌(ఎల్‌టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.359 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.361 కోట్లు)తో పోల్చితే ఒకటిన్నర శాతం క్షీణత నమోదైందని ఎల్‌టీఐ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.2,156 కోట్ల నుంచి

Most from this category