STOCKS

News


12 నుంచీ కొత్త బడ్జెట్‌ కసరత్తు!

Friday 5th October 2018
news_main1538713082.png-20869

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌-2020 మార్చి) బడ్జెట్‌ రూపకల్పనా కసరత్తు ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మొదట ఆర్థికశాఖ అధికారులు స్టీల్‌, విద్యుత్‌, హౌసింగ్‌, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యయాలు... సవరణలను ఖరారు చేసి, వచ్చే ఆర్థిక సంవత్సరం ‍క్తొత ప్రాజెక్టులపై సమీక్ష జరపనున్నారు. నవంబర్‌ 16 వరకూ ఈ తరహా సమావేశాలు వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో జరగనున్నాయి. చివరిరోజు రైల్వే, పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ ప్రతినిధులతో సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
రానున్నది ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’!
వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఓట్‌-ఆన్‌-అకౌంట్‌తో మధ్యంతర బడ్జెట్‌ను 2019 ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఇది 6వ బడ్జెట్‌ అవుతుంది. ఎన్నికల సంవత్సరంలో స్వల్ప కాల వ్యవధిలో అత్యవసర ప్రభుత్వ వ్యయాలకు ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. 2014 ఫిబ్రవరిలో అప్పటి ఆర్థికమంత్రి పి.చిదంబరం ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. గత యూపీఏ ప్రభుత్వం వరకూ ఫిబ్రవరి చివరిరోజు బడ్జెట్‌ను ప్రవేశపెడితే, మోడీ ప్రభుత్వం దీనిని ఫిబ్రవరి 1కి మార్చింది. 



You may be interested

మ్యూచ్‌వల్‌ ఫండ్ల.. చలో ఫారిన్‌!

Friday 5th October 2018

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో మన ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆస్థిరతల మధ్య కదలాడుతూ, నష్టాలను పంచుతున్నాయి. ఇందుకు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలే కారణం. దీంతో దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పేరొందిన పథకాల రాబడులు గత ఏడాది కాలంలో చూసుకుంటే మైనస్‌లోకి వెళ్లిపోయాయి. కానీ, ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు మంచి ర్యాలీ చేస్తున్నాయి. మన మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి నష్టాలు, అమెరికా మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసిన వారికి లాభాలు

రూపీ ఫ్లాట్‌..

Friday 5th October 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. స్వల్ప నష్టాలతో ప్రారంభమైన రూపాయి వెంటనే రికవరీ అయ్యింది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశపు నిర్ణయం శుక్రవారం వెలువడనుండటంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గానే ట్రేడవుతోంది. కాగా ఆర్‌బీఐ వరుసగా మూడోసారి కూడా వడ్డీ రేట్లను పెంచుతుందని మార్కెట్‌ అంచనా వేస్తోంది.     ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.59 వద్ద ట్రేడవుతోంది. మునపటి ముగింపు 73.58తో

Most from this category