STOCKS

News


ఆర్‌బీఐ స్వతంత్రతను గౌరవిస్తాం: కేంద్రం

Wednesday 31st October 2018
news_main1540974134.png-21614

ఆర్‌బీఐ, కేంద్రం మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కేంద్రం వ్యవహారశైలితో  విసుగు చెందుతున్న ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయవచ్చన్న వార్తలు సైతం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం కేంద్రం హుటాహుటిన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆర్‌బీఐకి గల స్వతంత్ర ప్రతిపత్తి గౌరస్తాం. నియమ నిబంధనలకు లోబడి ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి విఘాతం కలగనీయం’’ అని తెలిపింది. కొన్ని రోజులుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ‌జైట్లీ ఆర్‌బీఐపై విమర్శలు చేయడంతో ఇవి మరింత ముదిరాయి. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య వ్యాఖ్యలతో కేంద్రం, ఆర్‌బీఐ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.  ఆర్‌బీఐ గవర్నర్‌ను ముఖ్యమైన అంశాల్లో కేంద్ర ఆదేశించే అధికారాల్ని ఆర్‌బీఐ చట్టం ప్రకారం కేంద్రం సంక్రమింపచేసుకుందంటూ బుధవారం వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేయవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఈ కారణంతో బుధవారం ఉదయం స్టాక్‌ సూచీలు 1 శాతం వరకూ పతనమయ్యాయి. అయితే కేంద్రం ప్రకటనతో మధ్యాహ్న సమయానికి ఆ నష్టాల్ని పూడ్చుకోవడంతో పాటు సూచీలు 1 శాతం ర్యాలీ జరిపాయి. 


RBI

You may be interested

ఈసారి దీపావళికి మార్కెట్‌ ఎటూ..?

Wednesday 31st October 2018

- గడిచిన 10 ఏళ్లలో 5 సార్లు మాత్రమే లాభాలు - అక్టోబర్‌ 2011 దీపావళి నెలలోనే అత్యధికంగా 10 శాతం రాబడి ముంబై: మార్కెట్‌ పరంగా దీపావళీ అంటే అదో సెంటిమెంట్‌. లక్ష్మీదేవి కటాక్షం కోరుతూ ప్రత్యేక పూజలు జరిగే సందర్భం. పలు ప్రాంతాలలో కొత్త పుస్తకాలతో వ్యాపారం మొదలయ్యే ఈరోజును అనేక మంది ఇన్వెస్టర్లు నూతన సంవత్సరంగా కూడా భావిస్తుంటారు. ఇంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి దీపావళి సమయంలో ఈసారి ఇన్వెస్టర్లు

మార్కెట్‌కు ఎన్నికల ఫలితాలు కీలకం..!

Wednesday 31st October 2018

- డిసెంబర్‌ మొదటి వారం సూచీలకు అత్యంత కీలక సమయం - మార్కెట్‌ ఒడిదుడుకులపై మోర్గన్‌ స్టాన్లీ ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ వ్యాఖ్య ముంబై: లోక్‌ సభ ఎన్నికల వేడి అంతటా తగలడానికి ఇంకా సమయం ఉందని.. అసలు సిసలైన తీవ్ర ఒడిదుడుకులు త్వరలోనే నమోదుకాబోతున్నాయని మోర్గన్‌ స్టాన్లీ ఇండియా ఈక్విటీ రీసెర్చ్ హెడ్, స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉంటాయనే అంశంపై ఇప్పటివరకు అయితే

Most from this category