కేంద్రం సంస్కరణలు కొనసాగించాలి
By Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్య సాధనకు కేంద్రం కట్టుబడి ఉండాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. మరోవైపు గత నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన సంస్కరణలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం, దివాలా చట్టం వంటి సంక్లిష్టమైన చట్టాలను ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు ఇబ్బందిపడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రవేశపెట్టడంతో పాటు అమలు చేయడంలోనూ గణనీయంగా పురోగతి సాధించిందని అరవింద్ అభిప్రాయపడ్డారు. "ఆర్థిక స్థిరీకరణనేది ప్రస్తుత ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి. ఇది స్థూల ఆర్థిక స్థిరత్వ సాధనలో కీలకపాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యాలను మార్చుకోరాదు" అని ఆయన పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును 3.3 శాతానికి కట్టడి చేయాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. "ఎన్నికలయ్యే దాకా చట్టసభల అనుమతి అవసరమయ్యే కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడానికి సాధ్యపడకపోవచ్చు. అయితే నిబంధనలను స్వల్పంగా సవరించడం ద్వారా కొన్ని సంస్కరణలను యథాప్రకారం కొనసాగించవచ్చు. లిస్టెడ్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఖాయిలా పడిన పీఎస్యూల మూసివేత వంటి సంస్కరణలు ఆ కోవకి చెందినవి" అని అరవింద్ చెప్పారు.
You may be interested
పీనోట్ పెట్టుబడులు రూ.66,587 కోట్లు
Monday 19th November 2018న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా మన క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గుతూనే ఉన్నాయి. సెబీ గణాంకాలను పరిశీలిస్తే పీనోట్ పెట్టుబడులు (ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్) ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి రూ.79,548 కోట్లుగా ఉండగా, అక్టోబర్ చివరి నాటికి రూ.66,587 కోట్లకు తగ్గిపోయాయి. తొమ్మిదేళ్ల కాలంలోనే 2009 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి కావడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చేసుకోని విదేశీ ఇన్వెస్టర్లు మన
బీఎస్ఈ, ఎస్అండ్పీ వేరుబాట
Monday 19th November 2018న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎస్అండ్పీ డౌజోన్స్తో వ్యాపార భాగస్వామ్యానికి ముగింపు పలకాలని బీఎస్ఈ నిర్ణయించింది. ఇరు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ‘ఆసియా ఇండెక్స్’ 2013లో ఏర్పాటైంది. ఇరు సంస్థలు కలసి బెంచ్మార్క్ సెన్సెక్స్ సహా పలు సూచీలను నిర్వహిస్తున్నాయి. అయితే, ఎస్అండ్పీ డౌజోన్స్తో చేసుకున్న ఒప్పందం కాల పరిమితి డిసెంబర్ 31తో తీరిపోతుందని, ఇకపై పునరుద్ధరించుకోవడం లేదని బీఎస్ఈ అధికారులు తెలిపారు. సొంతంగానే సూచీల అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.