STOCKS

News


డేటా భద్రత బిల్లుపై విస్తృత చర్చలు..

Saturday 1st December 2018
news_main1543643014.png-22540

న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా భద్రత బిల్లు ముసాయిదాపై అంతర్‌ మంత్రిత్వ శాఖలతో పాటు సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చలు జరపనున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీన్ని సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతిపాదిత చట్టాన్నొక 'మైలురాయి'గా అభివర్ణించిన రవి శంకర్ ప్రసాద్.. ముసాయిదా బిల్లుపై కూలంకషంగా చర్చలు జరపాలని, అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. డిసెంబర్‌ 11న ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు డిజిటల్ ఇండియాపై ‘యోజన’ మ్యాగజైన్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపారు. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు 2018 ప్రకారం.. ఏ సంస్థైనా యూజర్ల నుంచి మత, రాజకీయ అభిప్రాయాలు, బయోమెట్రిక్‌ వివరాలు వంటి కీలకమైన డేటా సేకరిస్తున్నప్పుడు తప్పనిసరిగా వారి అంగీకారం కూడా పొందాల్సి ఉంటుంది. డేటా ప్రాసెసర్ల బాధ్యతలు, వ్యక్తిగత వివరాల గోప్యత, వ్యక్తుల హక్కులు, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు మొదలైనవన్నీ ఇందులో పొందుపరుస్తున్నారు.



You may be interested

కమోడిటీ ట్రేడింగ్‌ సమయం పెరిగింది

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: కమోడిటీ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ సమయం మరింతగా పెరగనుంది. అంతే కాకుండా ట్రేడింగ్‌లో పాల్గొనడానికి రైతు సంఘాలను, విదేశీ సంస్థలను సెబీ అనుమతించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సవరించిన వేళల ప్రకారం, వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్‌  ఉదయం 9 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి గం.11.55 నిమిషాల వరకూ కొనసాగుతుంది. గతంలో ట్రేడింగ్‌ సమయం ఉదయం

మాస్‌ మార్కెట్లోకి బెనెల్లి

Saturday 1st December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం బైక్‌ల బ్రాండ్‌ బెనెల్లి... భారత్‌లో మాస్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తోంది. ఇందుకోసం 200 సీసీలోపు సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తేబోతోంది. అంతర్జాతీయంగా ఈ విభాగంలో కంపెనీ ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో 125 సీసీ, 150, 175 సీసీ స్కూటర్లు కూడా ఉన్నాయి. ‘‘ఇవన్నీ కూడా 2020లో భారతీయ రోడ్లపై పరుగులు పెడతాయి’’ అని బెనెల్లి ఇండియా ఎండీ

Most from this category