STOCKS

News


ఎగుమతులకు మరింత జోష్‌

Saturday 2nd February 2019
news_main1549096143.png-23959

న్యూఢిల్లీ: ఎగుమతులను మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో వాటికి సంబంధించిన పథకాలకు కేటాయింపులు మరింతగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2019-20లో ఎగుమతి ప్రోత్సాహక స్కీములకు రూ. 4,115 కోట్ల మేర కేటాయింపులను బడ్జెట్‌లో ప్రతిపాదించింది. 2018-19లో ముందుగా రూ. 3,551 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత సవరించిన గణాంకాల ప్రకారం ఇది రూ. 3,681 కోట్లకు పెరిగింది. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌లో పెట్టుబడులు, జాతీయ ఎగుమతి బీమా ఖాతా, వడ్డీ రాయితీ స్కీమ్‌ మొదలైన వాటికి ఈ నిధులను కేటాయించారు. బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం వడ్డీ రాయితీ స్కీమ్‌లకు కేటాయింపులు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు పెరిగాయి. 2011-12 నుంచి ఎగుమతులు సుమారు 300 బిలియన్ డాలర్ల స్థాయిలోనే తిరుగాడుతున్నాయి. 2017-18లో స్వల్పంగా 10 శాతం పెరిగి 303 బిలియన్ డాలర్లకు చేరాయి.



You may be interested

చిన్న సంస్థలకు ఊతం

Saturday 2nd February 2019

నిమిషాల్లోనే రుణాలు ఎస్‌ఎంఈల నుంచే 25 శాతం కొనుగోళ్లు న్యూఢిల్లీ: కోట్లాది మందికి ఉపాధి కల్పించే లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) తోడ్పాటునిచ్చేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఇటీవలే 59 నిమిషాల్లోనే రూ. 1 కోటి దాకా రుణాల పథకాన్ని ప్రారంభించామని, జీఎస్‌టీలో నమోదు చేసుకున్న ఎస్‌ఎంఈలకు రూ. 1 కోటిపైగా రుణాలపై రెండు శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన

రవాణా విప్లవానికి భారత్‌ కెప్టెన్‌

Saturday 2nd February 2019

ఇంధన దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చు న్యూఢిల్లీ: అత్యధికంగా విద్యుత్ వాహనాల వినియోగంతో అంతర్జాతీయంగా రవాణా విప్లవానికి భారత్ సారథ్యం వహించగలదని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఈ క్రమంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ఇంధన భద్రత సాధించగలదన్నారు. ఇంధనం, గ్యాస్‌ దిగుమతులు తగ్గితే.. పునరుత్పాదక విద్యుత్ వనరులు గణనీయంగా వృద్ధి చెందగలవని మంత్రి వివరించారు. "ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే ఈ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించగలదు. అలాగే

Most from this category