STOCKS

News


చైనా ఉక్కు దిగుమతులపై ఆంక్షలు

Saturday 20th October 2018
news_main1540010239.png-21308

న్యూఢిల్లీ: దేశీ ఉక్కు పరిశ్రమను ఆదుకోవడంలో భాగంగా పలు రకాల చైనా దిగుమతులపై ప్రభుత్వం యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించింది. టన్ను ఉక్కుపై 185.51 డాలర్లు (రూ.13,622) చొప్పున డ్యూటీని విధిస్తున్నట్లు ప్రకటించిన రెవిన్యూ శాఖ, ఐదేళ్ల వరకు ఈ సుంకం కొనసాగుతుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు చైనా భారత్‌లో ఉక్కును విక్రయిస్తుందని ఆరోపిస్తూ.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫ్లాగ్‌ ఐరన్ అండ్‌ స్టీల్, ఉషా మార్టిన్, గెర్డావ్‌ స్టీల్‌ ఇండియా, వర్ధమాన్‌ స్పెషల్ స్టీల్స్, జైస్వాల్ నెకో ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లు సంయుక్తంగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌ (డీజీటీఆర్‌)కు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాయ్‌ బార్స్‌, స్ట్రయిట్‌ లెంత్‌ రాడ్స్‌ వంటి పలు ఉత్పత్తులపై టన్నుకు 44.89 నుంచి 185.51 డాలర్ల శ్రేణిలో యాంటీ డంపింగ్‌ డ్యూటీ విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 56,690 టన్నులుగా ఉన్నటువంటి వీటి దిగుమతులు.. 2016-17 నాటికి 1,80,959 టన్నులకు పెరిగాయి. మొత్తం ఉక్కు దిగుమతులు 1,32,933 టన్నుల నుంచి 2,56,004 టన్నులకు పెరిగిపోయాయి. ఇదే సమయంలో డిమాండ్‌ కూడా పెరిగింది. 2013-14లో 15,14,795 టన్నుల నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరానికి 16,69,653 టన్నులకు చేరుకుంది. దిగుమతులు పెరిగిన కారణంగా చైనాతో ఉన్న వాణిజ్య లోటు 51.11 బిలియన్‌ డాలర్ల నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 63.12 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. 



You may be interested

ఎన్‌డీటీవీపై రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కేసు

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇతరులు కలిసి తమకు వ్యతిరేకంగా రూ.10వేల కోట్లకు పరువు నష్టం దావాను దాఖలు చేసినట్లు ఎన్‌డీటీవీ వార్తా సంస్థ తెలియజేసింది. అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఇది దాఖలైందని, ఈ మేరకు అక్కడి నుంచి తమకు ఈ నెల 18న నోటీసులు అందాయని ఈ సంస్థ తెలియజేసింది. కంపెనీతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ కో చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ ఎడిటర్‌లను బాధ్యులను చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైనట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు

4 శాతం పెరిగిన పసిడి దిగుమతులు

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు ప్రస్తుత  ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో  (ఏప్రిల్‌-సెప్టెంబర్) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్‌ డాలర్లు. వాణిజ్యశాఖ ఈ మేరకు తాజా గణాంకాలను విడుదల చేసింది.వార్షికంగా భారత్‌ 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ దీనికి నేపథ్యం. పసిడి దిగుమతులు

Most from this category