STOCKS

News


గ్రాముకు రూ. 3,119 ధర..

Saturday 22nd December 2018
news_main1545449859.png-23147

న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేసే పసిడి బాండ్ల సిరీస్‌కు సంబంధించి గ్రాముకు రూ.3,119 ధరను కేంద్రం నిర్ణయించింది. 2018-19 సావరీన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌లో నాలుగో సిరీస్ కింద బాండ్ల జారీ డిసెంబర్ 24న ప్రారంభమై 28న ముగుస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారికి, డిజిటల్ విధానంలో చెల్లింపులు జరిపేవారికి ఇష్యూ ధరలో గ్రాముపై రూ.50 డిస్కౌంట్ ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన వారికి గ్రాము ధర రూ.3,069గా ఉంటుందని పేర్కొంది. అక్టోబర్‌తో ప్రారంభమైన పసిడి బాండ్ల జారీ వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ప్రతి నెలా ఉంటుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. భౌతిక రూపంలో బంగారానికి డిమాండ్ తగ్గించేందుకు, పసిడి కొనుగోళ్లకు వెచ్చిస్తున్న మొత్తాన్ని ఆర్థిక సాధనాల్లోకి మళ్లించేందుకు 2015 నవంబర్‌లో సావరీన్ గోల్డ్ బాండ్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. 



You may be interested

ఉపకరణాలన్నిటా... ‘ఎంఐ’ ముద్ర!

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్‌... హాల్లో ఎంఐ ఫ్రిజ్‌... కిచెన్‌లో ఎంఐ వాటర్‌ ప్యూరిఫయర్‌... బాల్కనీలో ఎంఐ వాషింగ్‌ మెషిన్‌... బెడ్‌ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌

దేశవ్యాప్తంగా 60 ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లు

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 60 ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కొత్తగా 5.87 కోట్ల కనెక్షన్లు మంజూరైన నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరా కోసం బాట్లింగ్ సామర్ధ్యం మరింత

Most from this category