STOCKS

News


జీఎస్‌టీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ గడువు పెంపు

Saturday 1st December 2018
news_main1543642123.png-22536

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాలకు సంబంధించి అక్టోబర్‌ - డిసెంబర్‌ కాలానికి టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత) రిటర్న్స్‌ ఫైలింగ్‌కు గడువును కేం‍ద్రం పెంచింది. 2019 జనవరి 31 వరకూ రిటర్న్స్‌ దాఖలు చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.జీఎస్‌టీ కింద టీడీఎస్‌ ప్రొవిజన్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ అమల్లోకి వచ్చాయి. సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) చట్టం ప్రకారం- రూ.2.5 లక్షల దాటి వస్తువులు, సేవల సరఫరాదారులకు చేసే చెల్లింపులపై నోటిఫైడ్‌ సంస్థలు 1 శాతం టీడీఎస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర చట్టాల (ఎస్‌జీఎస్‌టీ) కింద మరో 1 శాతం పన్నునూ విధించాలి. 



You may be interested

క్లిక్‌ చేస్తే సారొస్తారు!

Saturday 1st December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌ వంటివే కాదు ప్లంబర్, పెయింటర్లను కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసే రోజులివి. అయితే వీటిల్లో ఏ సేవలకైనా సరే ఇంటికొచ్చే వ్యక్తి గురించి మనం ఎంక్వైరీ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే? ఆర్డర్లను డెలివరీ చేయటం వరకే వారి పని. మరి, హోమ్‌ ట్యూషన్స్‌ చెప్పే ట్యూటర్స్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలంటే? తల్లిదండ్రులు చాలానే ఆలోచించాలి. ఎందుకంటే ట్యూటర్‌ మేథస్సే కాదు అతని వ్యక్తిత్వం,

మూడేళ్లలో 15 శాతం... పదేళ్లలో 25 శాతం...?

Saturday 1st December 2018

వార్షికంగా 15 శాతం రాబడులను పదేళ్ల కాలంలో ఇచ్చిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం ఒకటి. వార్షికంగా 25 శాతం చొప్పున రాబడులను అందించినది మరో పథకం. మరి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. నిజానికి ఈ రెండింటిలో రెండో పథకం పనితీరు ఆచరణ సాధ్యమే. కానీ, మొదటి పథకం పనితీరు దీర్ఘకాలానికి చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు వార్షికంగా 15 శాతం

Most from this category