STOCKS

News


రూ.20,000 కోట్ల జీఎస్టీ ఎగవేత

Thursday 28th February 2019
Markets_main1551337972.png-24375

  • ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య కాలంలో గుర్తింపు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకు రూ.20000 కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.10,000 కోట్ల మేర రికవరీ చేసినట్టు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ సభ్యుడు జాన్‌జోసెఫ్‌ తెలిపారు. మోసాల నివారణకు, నిబంధనలు పాటించేలా చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కేవలం 5-10 శాతం మంది పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు అనంతరం మార్పునకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కోసం రియల్‌ ఎస్టేట్‌ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్లకు ఒక శాతానికి జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ ఈ వారంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తగ్గింపును పరిశ్రమ అమల్లో పెట్టి వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. తగ్గింపునకు ముందు జీఎస్టీ రేట్లు 12 శాతం, 8 శాతం చొప్పున ఉన్నాయి.



You may be interested

అబెబ్బే.... అదేలా కుదురుతుంది!

Thursday 28th February 2019

ఐటీ రిఫండ్స్‌తో బాకీ తీర్చడానికి రుణదాతల విముఖత ఎరిక్‌సన్‌కు రుణం కేసులో  ఆర్‌కామ్‌కు తీవ్ర ఇబ్బంది న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్‌కు బాకీ చెల్లింపునకు ఆదాయ పన్ను రిఫండ్ ‍ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను వినియోగించాలన్న ఆర్‌కామ్‌ ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఇందుకు అనుమతించాలంటూ ఆర్‌కామ్‌ చేసిన విజ్ఞప్తిని ఫైనాన్షియల్‌ క్రెడిటార్స్‌ (రుణ దాతలు) తోసిపుచ్చారు. ఈ మేరకు తమ వాదనలను ఎన్‌సీఎల్‌ఏటీ

ధరల నియంత్రణల్లోకి కేన్సర్‌ ఔషధాలు

Thursday 28th February 2019

నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 40 డగ్స్‌కు చోటు న్యూఢిల్లీ: కేన్సర్‌ చికిత్సల్లో వినియోగించే నాన్‌ షెడ్యూల్డ్‌ విభాగంలోని 42 ఔషధాలను ధరల నియంత్రణల విధానంలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఔషధాల విక్రయ ధరలపై 30 శాతం మార్జిన్‌ను గరిష్ట పరిమితిగా విధించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జాతీయ ఫార్మాస్యూటికల్‌ ధరల నిర్ణయాక మండలి (ఎన్‌పీపీఏ) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఔషధ విభాగం తన ప్రకటన ద్వారా తెలియజేసింది. ‘‘ఔషధ

Most from this category