STOCKS

News


టెలికం నుంచి రూ. 41వేల కోట్ల ఆదాయ అంచనా

Saturday 2nd February 2019
news_main1549109963.png-23981

న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరంలో టెలికం రంగం నుంచి రూ. 41519. 76 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుత ఏడాది టెలికం రంగ రెవెన్యూ కన్నా ఇది కాస్త అధికం. 2018-19లో టెలికం రంగం నుంచి రూ. 48661కోట్ల ఆదాయం ఉంటుందని ప్రభుత్వం గత బడ్జెట్లో అంచనా వేసింది. కానీ ప్రస్తుతం ఈ మొత్తం రూ. 39245 కోట్లకు పరిమితమయింది. ఆపరేటర్ల నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం వినియోగ చార్జీలు టెలికం రెవెన్యూలో ఉంటాయి. 2018 జూలై- సెప్టెంబర్‌ నాటికి ట్రాయ్‌ లెక్కల ప్రకారం టెలికం సేవల సవరించిన స్థూల రెవెన్యూ(ఏజీఆర్‌) అంతకుమందేడాదితో పోలిస్తే 13.26 శాతం క్షీణించింది. 2016 నుంచి ఈ రంగ ఆదాయం తగ్గుతూ వస్తోంది. 2017-18లో ఈ ఆదాయం దాదాపు 22 శాతం తగ్గింది. ప్రస్తుత ఆదాయ అంచనాల్లో ఈ ఏడాది జరిపే స్పెక్ట్రం వేలాన్ని కలిపి లెక్కించలేదు.



You may be interested

ఇది రైతులను అవమానించడమే

Saturday 2nd February 2019

బడ్జెట్‌పై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ విమర్శలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ రైతుల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం’కింద ఇప్పుడు ఒక్కో రైతుకు రోజుకు రూ.17 చొప్పున ఇస్తామంటూ అన్నదాతలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ సమావేశం అనంతరం రాహుల్‌ స్పందిస్తూ..‘రైతులకు ఏటా

మార్పు కోసం పది లక్ష్యాలు

Saturday 2nd February 2019

జీవన ప్రమాణాలకు నాంది: పీయూష్‌         ప్రగతి పథంలో ముందుకు సాగడమే పది లక్ష్యాల ఉద్దేశం పది లక్ష్యాలతో భారతదేశ దశ దిశలో మార్పుతెస్తామంటూ సార్వత్రిక ఎన్నికలవేళ మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌తో జనం ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వం పదిలక్ష్యాలను నిర్దేశించింది. బడ్జెట్‌ని ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ రాబోయే పది ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థకి తాత్కాలిక బడ్జెట్‌తో పునాదివేసారు. ఇది తాత్కాలికం మాత్రమే కాదని

Most from this category