STOCKS

News


ద్రవ్యోల్బణంపై విజయం: గోయెల్‌

Friday 1st February 2019
news_main1549027079.png-23953

ధరల పెరుగుదల వేగాన్ని ప్రభుత్వం విజయవంతంగా అడ్డుకున్నట్లు ఆర్థిక మంత్రి పియూష్‌ గోయెల్‌ తెలిపారు. అలాగే పేదలపై అసమంజస పన్ను భారం పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ధరల పెరుగుదల రేటును సగటున 4.6 శాతానికి తీసుకువచ్చామని తెలిపారు. 2009-2014 మధ్య సగటు ద్రవ్యోల్బణం రేటు 10.1 శాతమని పేర్కొన్నారు.  2018 డిసెంబర్‌లో ద్రవ్యల్బణం కేవలం 2.19 శాతమన్న గణాంకాలను కూడా ఆయన ఉటంకించారు. భారత రైతులు ప్రస్తుతం తమ ఆదాయాల్లో 35 నుంచి 40 శాతం కనీస అవసరాలైన ఆహారం, పర్యాటకం, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, హౌసింగ్‌లపై వెచ్చిస్తున్నారంటే, అది ద్రవ్యోల్బణం కట్టడి ఫలితమేనన్నారు.

ఆర్థిక వ్యవస్థలో 11 నుంచి 6కు ఎదిగాం...
2013-14లో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిఉన్న భారత్‌ తాజాగా ఆరవ స్థానానికి ఎదిగిందని గోయెల్‌ అన్నారు. ఐదవ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను అధిగమించడానికి సైతం భారత్‌ తగిన పరిస్థితులను సృష్టించుకుంటోందని పేర్కొన్నారు.  ప్రస్తుతం 19.39 లక్షల కోట్ల డాలర్ల పరిమాణంతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా (12.23 లక్షల కోట్ల డాలర్లు), జపాన్ (4.87 లక్షల కోట్ల డాలర్లు) జర్మనీ (3.67 లక్షల కోట్ల డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్ జీడీపీ 2.62 లక్షల కోట్ల డాలర్లుకాగా, భారత్‌ జీడీపీ విలువ 2.59 లక్షల డాలర్లు. కాగా ఫ్రాన్స్ జీడీపీ 2.58 లక్షల కోట్ల స్థాయిలో ఉంది.

ఎనిమిదేళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
వచ్చే ఐదు సంవత్సరాల్లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని, ఎనిమిది సంవత్సరాల్లో 10 ట్రిలియన్‌ డాలర్లుగా అవతరిస్తుందని గోయెల్‌ ప్రకటించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవస్థాగత ఆర్థిక సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని అన్నారు.

ఐదేళ్లలో 239 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయ్‌
గడచిన ఐదు సంవత్సరాల్లో భారత్‌కు 239 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని ఆర్థికమంత్రి తెలిపారు. నియంత్రణా వ్యవస్థల స్థిరత్వం, పటిష్టత, పారదర్శకత, ఆర్థిక వృద్ధి, పటిష్ట ఆర్థిక పరిస్థితులు దీనికి కారణమని తెలిపారు. ఎఫ్‌డీఐ విధానంలో భారీ సరళీకరణ చర్యలూ కలిసి వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌, రక్షణ, ఎయిర్‌లైన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ప్రస్తావించారు. మారిషస్‌, సింగపూర్‌, నెథర్లాండ్స్‌, అమెరికా, జపాన్‌ల నుంచి ప్రధానంగా పెట్టుబడులు వచ్చాయన్నారు.



You may be interested

యస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రాజీనామా

Friday 1st February 2019

న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్ ప్రళయ్ మండల్ గురువారం తన పదవికి రాజీనామాచేశారు. రిటైల్‌ అండ్‌ బిజినెస్‌ బ్యాంకింగ్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్న ఈయన.. తన రాజీనామా లేఖను జనవరి 31న అందించినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో బ్యాంక్‌ తెలియజేసింది. మార్చి 31లోపు ఈయనకు నోటీసు అందజేస్తామని పేర్కొంది. 2012 నుంచి ఈయన యస్‌బ్యాంకుకు సేవలందిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.

మిగితా 8 బ్యాంకులపై త్వరలో ఎత్తివేత

Friday 1st February 2019

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న మిగతా 8 బ్యాంకులు కూడా త్వరలో ఆంక్షల నుంచి బైటపడగలవని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మూడు బ్యాంకులు (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌) ఇప్పటికే బైటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన అలహాబాద్‌

Most from this category