STOCKS

News


ఆర్‌బీఐ డైరెక్టర్‌గా స్వామినాథన్ గురుమూర్తి

Thursday 9th August 2018
news_main1533791231.png-19064

న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్ స్వామినాథన్ గురుమూర్తిని రిజర్వ్ బ్యాంక్ బోర్డులో డైరెక్టరుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)లో భాగమైన స్వదేశీ జాగరణ్ మంచ్‌తో ఆయనకు అనుబంధముంది. డీమోనిటైజేషన్‌ను గట్టిగా సమర్ధించిన వారిలో ఆయన కూడా ఒకరు. తమిళ పత్రిక తుగ్లక్‌కు గురుమూర్తి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. "నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలన్న ఉద్దేశంతోనే నేనెప్పుడూ ఏ ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో డైరెక్టర్‌షిప్‌ బాధ్యతలు తీసుకోలేదు. ఇదే మొట్టమొదటిసారి. ప్రజలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చాలనే అభిప్రాయంతోనే తీవ్ర ఒత్తిళ్ల మధ్య ఈ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించాను" అని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్‌లో గురుమూర్తి పేర్కొన్నారు. 



You may be interested

వెల్‌కమ్‌ టు ఐకియా..

Thursday 9th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్‌ దిగ్గజం ఐకియా... ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిసింది. గురువారం ఈ స్టోర్‌ ప్రారంభం కానుంది. హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500

నాట్కో ఫార్మా లాభం 93 శాతం అప్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: నాట్కో ఫార్మా జూన్‌ త్రైమాసికానికి చక్కని ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ లాభం ఏకంగా 93 శాతం వృద్ధి చెంది రూ.181 కోట్లుగా నమోదైంది. విక్రయాలు పెరగడంతో కంపెనీ ఈ స్థాయి లాభాలను నమోదు చేసింది. ఆదాయం సైతం రూ.574 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో లాభం రూ.93.7 కోట్లు, ఆదాయం రూ.448 కోట్లుగా ఉండడం గమనార్హం. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు

Most from this category