News


లక్ష్యం.. 1 లక్ష డిజిటల్ గ్రామాలు

Friday 1st February 2019
news_main1549026582.png-23951

- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై జాతీయ కేంద్రం ఏర్పాటు
న్యూఢిల్లీ: కొంగొత్త టెక్నాలజీల ప్రయోజనాలను ప్రజలందరికీ చేరువ చేసే దిశగా వచ్చే అయిదేళ్లలో 1 లక్ష గ్రామాలను 'డిజిటల్ గ్రామాలు'గా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై జాతీయ స్థాయిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 2030 నాటికి భారీ స్థాయిలో డిజిటల్ ఇన్‌ఫ్రా, డిజిటల్ ఎకానమీ ఏర్పాటుకు ఇటీవలి డిజిటైజేషన్ ప్రక్రియ తోడ్పడుతుందని, పెద్ద ఎత్తున వస్తున్న స్టార్టప్స్‌ ఇందుకు ఊతంగా నిలుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. వీటన్నింటితో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. మరోవైపు, డిజిటల్ సర్వీసులు అందిస్తున్న మూడు లక్షల పైచిలుకు కామన్ సర్వీస్ సెంటర్స్‌ (సీఎస్‌సీ)లతో 12 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని గోయల్ తెలిపారు. మేకిన్ ఇండియా నినాదం కింద దేశీయంగా మొబైల్స్‌, ఇతరత్రా పరికరాల తయారీ సంస్థల సంఖ్య 2 నుంచి 268కి పెరిగిందని, తద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన జరిగిందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్‌, మెడికల్ పరికరాలు మొదలైన వాటి ఉత్పత్తిలో ప్రపంచ హబ్‌గా భారత్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.



You may be interested

మిగితా 8 బ్యాంకులపై త్వరలో ఎత్తివేత

Friday 1st February 2019

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో సత్వర దిద్దుబాటు చర్యలు (పీసీఏ) ఎదుర్కొంటున్న మిగతా 8 బ్యాంకులు కూడా త్వరలో ఆంక్షల నుంచి బైటపడగలవని ఆర్థిక మంత్రి పియుష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మూడు బ్యాంకులు (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌) ఇప్పటికే బైటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. మొండిబాకీలు భారీగా పెరిగిపోయిన అలహాబాద్‌

తీవ్ర హెచ్చుతగ్గులు...లాభాల ముగింపు

Friday 1st February 2019

212 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్‌ రాణించిన అటో, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా షేర్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాకర్షక బడ్జెట్‌ ప్రతిపాదించే సమయంలో త్రీవ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్‌ చివరకు లాభాలతో ముగిసింది. అటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియల్టీ రంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 212 పాయింట్లను ఆర్జించి 36,469 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 10,893 వద్ద ముగిశాయి. మరోవైపు బ్యాంకింగ్‌, మెటల్‌, మీడియా రంగ షేర్లు నష్టాలతో

Most from this category