STOCKS

News


మల్టీ-బ్రాండ్‌లో 100% ఎఫ్‌డీఐలు అనుమతించాలి

Wednesday 12th December 2018
news_main1544592191.png-22854

న్యూఢిల్లీ: మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐ పేర్కొంది. అలాగే, మల్టీ-బ్రాండ్ రిటైల్‌ రంగ వృద్ధికి తోడ్పడేలా వ్యాపారాల నిర్వహణ నిబంధనలను మరింత సరళతరం చేయాలని కోరింది. కన్సల్టెన్సీ సంస్థ ఏటీ కియర్నీతో కలిసి రూపొందించిన జాతీయ రిటైల్ విధాన నివేదికలో సీఐఐ ఈ మేరకు సిఫార్సులు చేసింది. సంప్రదాయ, ఆధునిక రిటైల్‌ వ్యాపారాలు కలిసి పురోగమించేందుకు అవరోధాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించేలా సమగ్రమైన జాతీయ రిటైల్ విధానాన్ని కేంద్రం అమల్లోకి తేవాలని అభిప్రాయపడింది. కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని, సిబ్బందిలో మహిళల సంఖ్య మరింత పెరిగేలా పార్ట్‌-టైమ్ కార్మికుల విధానాలను క్రమబద్ధీకరించాలని, తూనికలు.. కొలతలకు సంబంధించి పాతబడిపోయిన చట్టాలను సవరించాలని నివేదికలో పేర్కొంది. అలాగే, టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ రిటైల్‌ వ్యాపారాలు ఆధునిక పద్ధతులకు మారేలా తోడ్పడాల్సిన అవసరం ఉందని వివరించింది. 



You may be interested

వ్యవస్థలోకి రూ. 10వేల కోట్లు: ఆర్‌బీఐ

Wednesday 12th December 2018

ముంబై: బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ - ఓఎంవో) రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థలోకి రూ. 10,000 కోట్లను పంపిస్తోంది. డిసెంబర్‌ 13న (గురువారం) ఈ లావాదేవీలు నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం దరిమిలా.. రిజర్వ్ బ్యాంక్‌ గతవారమే ఆర్థిక వ్యవస్థలోకి రూ. 10,000 కోట్లు పంపింది. లిక్విడిటీ అవసరాలను మదింపు చేసిన తర్వాత డిసెంబర్‌లో మొత్తం రూ.40,000 కోట్ల

ఎర్నింగ్స్‌పై కన్నేయండి!

Wednesday 12th December 2018

దాస్‌ నియామకం ముగిసిన కధ క్యు3 ఫలితాలే ఇకపై మార్కెట్లకు ట్రిగ్గర్‌ బ్రోకరేజ్‌ల అంచనా ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత్‌దాస్‌ నియామకాన్ని మార్కెట్లు జీర్ణించుకున్నాయని, ఇకపై సూచీల్లో అప్‌మూవ్‌కు ఎర్నింగ్సే ఆధారమని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా అనంతరం శక్తికాంత్‌దాస్‌ను మూడేళ్ల కాలపరిమితితో ఆర్‌బీఐకి గవర్నర్‌గా ప్రభుత్వం నియమించింది. మరికొన్ని రోజుల్లో ఆర్‌బీఐ కీలక మీటింగ్‌ జరగనుంది. ఉర్జిత్‌ రాజీనామా, దాస్‌ నియామకాన్ని మార్కెట్లు స్వాగతించినట్లు కనిపిస్తున్నాయని, ఇప్పటికే ఈ అంశాలను మార్కెట్లు

Most from this category