STOCKS

News


జీఎస్టీ ఎగవేతలపై ఇక ముమ్మర చర్యలు

Thursday 13th September 2018
news_main1536813670.png-20218

న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతలను నిరోధించేందుకు సోదాలు, స్వాధీనాలతో పాటు అరెస్ట్‌లు తదితర అంశాలను చూసేందుకు జీఎస్టీ కమిషనర్‌ (ఇన్వెస్టిగేషన్‌) కార్యాలయాన్ని కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది. తొలి కమిషనర్‌గా నీరజ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. వ్యాపారులు కొత్త పన్ను చట్టానికి మళ్లేందుకు, అలవాటు పడేందుకు కొంత కాలం చూసీ, చూడనట్టు వ్యవహరించిన కేంద్రం ఇప్పుడు తీవ్ర చర్యలకు రంగం సిద్ధం చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చి ఏడాది దాటిపోవడం, పన్ను వసూళ్లల్లో ఏమంత వృద్ధి లేకపోవడంతో... ఎగవేతలను గుర్తించడం ద్వారా పన్ను వసూళ్లను పెంచడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జీఎస్టీ కమిషనర్‌ కార్యాలయం ఏర్పాటయిందని... విధాన, న్యాయపరమైన అంశాలు, సోదాలు, స్వాధీనాలు, అరెస్ట్‌లు, విచారణ, ఎక్సైజ్‌ చట్టం, సేవా పన్నుకు సంబంధించిన అంశాలను కమిషనర్‌ చూస్తారని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ జారీ చేసిన సూచనల్లో పేర్కొంది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విధులను సైతం పర్యవేక్షిస్తారని తెలిపింది. అలాగే, డీజీజీఎస్‌టీఐ, డీజీఏఆర్‌ఎంలను కూడా సమన్వయం చేసుకుంటారని పేర్కొంది. You may be interested

రూపాయి పతనాన్ని అడ్డుకుంటాం..

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 'అసంబద్ధ స్థాయి'కి పడిపోకుండా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అన్ని చర్యలు తీసుకుంటాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ స్పష్టం చేశారు. రూపాయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయులకు పతనం కావడం వెనుక హేతుబద్ధత లేదని, మార్కెట్ ఆపరేటర్ల ఓవర్‌రియాక్షన్‌ను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. ముడిచమురు ధరలు

నెల రోజుల్లో 5 మొండిపద్దుల పరిష్కారం

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: సుమారు రూ.8,254 కోట్ల మేర రుణాలు పొందిన అయిదు మొండి పద్దుల సమస్య నెలరోజుల్లో ఒక కొలిక్కి రావొచ్చని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) సీఎండీ రాజీవ్ శర్మ అంచనా వేశారు. ఈ లోగా వీటి  పరిష్కార ప్రక్రియ అమలు చేసే అవకాశాలున్నాయని చెప్పారాయన. జీఎంఆర్ చత్తీస్‌గఢ్, జబువా పవర్‌, కేఎస్‌కే మహానది పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్లతో చర్చలు దాదాపు తుది దశలో

Most from this category