STOCKS

News


బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌....పార్లమెంటు అనుమతి కోరిన కేంద్రం

Thursday 20th December 2018
news_main1545299532.png-23113

  • రూ.41,000 కోట్ల అదనపు మూలధనం

మూలధన ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం సాయమందించేందుకు రెడీ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.41,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని అందించేందుకు పార్లమెంట్‌ అనుమతి కోరింది. 2017 అక్టోబర్‌లో ప్రకటించిన రూ.2.11 లక్షల కోట్ల బెయిల్‌ఔట్‌ ప్యాకేజ్‌కి ఈ నిధులు అదనం. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం రోజు ఈ అదనపు నిధులకు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్స్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌.. ప్రభత్వు బ్యాంకులకు అందించే రీక్యాపిటలైజేషన్‌ మొత్తాన్ని రూ.41,000 కోట్లు పెంచాలని కోరుతోంది. రీక్యాపిటలైజేషన్‌ బాండ్స్‌ రూపంలో బ్యాంకులకు ఈ నిధులను అందించనుంది. 
కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.70,000 కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికలు ప్రకటించింది. మొండి బ‍కాయిలు బాగా పెరగడం వల్ల ఆర్‌బీఐ.. బ్యాంకులు అసెట్‌ క్వాలిటీ సమీక్షకు ఆదేశించింది. దీంతో 2017 నాటికి ప్రభుత్వ బ్యాంకులకు అధిక నిధులు అవసరమని తేలింది. అప్పుడు కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. 2015 నాటి రీక్యాపిటలైజేషన్‌ ప్యాకేజ్‌లో బ్యాంకులకు చెల్లించకుండా మిగిలిన మొత్తం రూ.18,000 కోట్లు కూడా ఇందులో భాగమే. కేంద్రం రూ.2.11 లక్షల కోట్లలో 2017-18లో రూ.88 వేల కోట్లు అందించింది. 2018-19లో రూ.65,000 ‍కోట్లు అందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి దాకా రూ.22,900 కోట్లు అందించింది. ఇక మిగిలిన రూ.58 వేల కోట్లను బ్యాంకులు 2019 మార్చి చివరి నాటికి మార్కెట్‌ నుంచి సమీకరించాల్సి ఉంది. అయితే బ్యాంకులు ఇప్పటి దాకా మార్కెట్‌ నుంచి రూ.17,800 కోట్లను సమీకరించాయి. ఇంకా దాదాపు రూ.40,000 కోట్లు సమీకరించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేంద్రం ఇప్పుడు బ్యాంకులకు అందించాలని చూస్తోంది. 



You may be interested

ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

Thursday 20th December 2018

ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్‌ ఏడురోజుల సుధీర్ఘర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల పతనంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్ల నష్టంతో 36,432 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,951 వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటు పెంపుతో అమెరికా, ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ సంకేతాలను అందుకున్న సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

యస్‌ బ్యాంక్‌ 4శాతం జూమ్‌..!

Thursday 20th December 2018

ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 4శాతం ర్యాలీ చేశాయి. నేడు యస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో రూ.179.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవల చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా చేయడంతో యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా డైరెక్టర్లలో ఒకరైన బ్రహ్మ్‌ దత్‌ పేరును రిజర్వు బ్యాంకుకు యస్‌బ్యాంక్‌ సిఫారసు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇంట్రాడేలో షేరు 4.17శాతం లాభపడి రూ.187.10ల వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం

Most from this category