STOCKS

News


ఇక ఫ్లయిట్‌లోనూ మొబైల్‌ సర్వీసులు

Monday 17th December 2018
news_main1545034653.png-22992

న్యూఢిల్లీ: ఇకపై విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాల్లో కూడా మొబైల్ కాల్స్‌కు, ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దేశీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశ విదేశ ఎయిర్‌లైన్స్‌, షిప్పింగ్ కంపెనీలు ఇక నుంచి ఇన్‌ఫ్లయిట్‌, మారిటైమ్ వాయిస్.. డేటా సర్వీసులు అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందుకోసం అవి దేశీ టెలికం సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఇన్‌-ఫ్లయిట్ అండ్ మారిటైమ్‌ కనెక్టివిటీ (ఐఎఫ్‌ఎంసీ) రూల్స్ 2018గా ఈ మార్గదర్శకాలను వ్యవహరించనున్నట్లు, అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు డిసెంబర్ 14న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. మార్గదర్శకాల ప్రకారం భారత గగనతలంలో ఎగిరే విమానం కనీసం 3,000 మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత ఐఎఫ్‌ఎంసీ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. వార్షికంగా రూ. 1 ఫీజుతో పదేళ్ల పాటు ఐఎఫ్‌ఎంసీ లైసెన్సులు జారీ అవుతాయి. అందించే సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి పర్మిట్ హోల్డరు.. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.



You may be interested

35,800 మద్దతు కీలకం

Monday 17th December 2018

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా, ప్రపంచ మార్కెట్ల నెగిటివ్‌ ట్రెండ్‌ వంటి పలు ప్రతికూలాంశాల నడుమ గతవారం మన మార్కెట్‌ ఆశ్చర్యకరంగా లాభాలతో ముగిసింది. అంతేకాకుండా ఇక్కడి స్టాక్‌ మార్కెట్‌ ఒడుదుడుకుల్ని సూచించే వీఐఎక్స్‌ (వొలటాలిటీ ఇండెక్స్‌) 22.5 స్థాయి నుంచి 16 పాయింట్లలోపునకు పడిపోయింది. నవంబర్‌ నెలలో నిఫ్టీ 10,000 పాయింట్ల నుంచి 10,940 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపిన తరుణంలో

భారీ నిధులు...ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి ? 

Monday 17th December 2018

ప్ర: భూమి అమ్మకం వల్ల ఒకేసారి భారీగా రూ.5 కోట్లు వచ్చాయి. దీనిని దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఎన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ? ఎన్ని నెలల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుంది ? -నవకాంత్‌, హైదరాబాద్‌  జ: మీరు అడిగిన రెండు ప్రశ్నల్లో రెండో ప్రశ్న ముఖ్యమైనది.రూ. 5 కోట్ల పెట్టుబడి అంటే పెద్ద మొత్తమే. ఇది మీ రెండేళ్ల ఆదాయమైతే, ఈ మొత్తాన్ని ఒక ఏడాది

Most from this category