STOCKS

News


పీఎస్‌యూ బ్యాంకులకు అదనంగా రూ.30,000 కోట్లు

Friday 14th December 2018
news_main1544763227.png-22915

న్యూఢిల్లీ: మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ చేయలేని పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) అదనంగా రూ.30,000 కోట్ల నిధుల సాయం అందించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌ ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తాము సొంతంగా రూ.58,000 కోట్లను 2019 మార్చి నాటికి స్టాక్‌ మార్కెట్ల నుంచి సమీకరించాల్సి ఉంది. అయితే, మార్కెట్లలో అననుకూల పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు ఈ మేరకు నిధులను సమీకరించలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో పీఎస్‌బీలు ఎన్‌పీఏల పెరుగుదల సమస్యను ఎదుర్కొన్నాయి. దీంతో వాటి బ్యాలన్స్‌ షీట్లపై ఒత్తిడి నెలకొంది. అయితే, బాసెల్‌-3 నిబంధనలకు లోబడి ప్రభుత్వరంగ బ్యాంకులు క్యాపిటల్‌ కన్జర్వేషన్‌ బఫర్‌ (సీసీబీ) లక్ష్యాన్ని చేరుకోవాల్సిన గడువును ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్‌బీఐ గత సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ రూపంలో బ్యాంకుల చేతికి రూ.37,000 కోట్లు అందుబాటులోకి వచ్చాయి. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎంపిక ఖరారు

Friday 14th December 2018

ముంబై: యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎంపిక ఖరారైంది. యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా గత నెలలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చైర్మన్‌ ఎంపికను పూర్తి చేశామని, ఆమోదం కోసం ఆర్‌బీఐకు పంపించామని యస్‌ బ్యాంక్‌ గురువారం తెలిపింది. అయితే ఎవరిని చైర్మన్‌గా ఎంపిక చేసింది, ఇతర వివరాలను బ్యాంక్‌ వెల్లడించలేదు. మరోవైపు సీఈఓ, ఎమ్‌డీ కోసం సెర్చ్‌ అండ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్‌ఎస్‌సీ) కసరత్తు చేస్తోందని

యూబీఎస్‌ టెక్నాలజీతో విడుదలైన యమహా శాల్యుటో

Friday 14th December 2018

న్యూఢిల్లీ: ఇండియా యమహా మోటార్‌ (ఐవైఎం) అధునాతన బ్రేకింగ్‌ వ్యవస్థతో అభివృద్ధి పరచిన రెండు శాల్యుటో మోడల్‌ బైక్‌లను గురువారం విడుదలచేసింది. ఏకీకృత బ్రేకింగ్ వ్యవస్థ (యూబీఎస్‌) కలిగిన శాల్యుటో, శాల్యుటో ఆర్‌ఎక్స్‌ మోడళ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. డ్రమ్‌, డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్లలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉండగా.. శాల్యుటో (125 సీసీ) బైక్‌ ధరల శ్రేణి రూ.58,800 – రూ.61,500 స్థాయిలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. శాల్యుటో ఆర్‌ఎక్స్‌

Most from this category